మ‌రో సారి నోరు పారేసుకున్నా జ‌గ‌న్

Published : Aug 10, 2017, 05:00 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
మ‌రో సారి నోరు పారేసుకున్నా జ‌గ‌న్

సారాంశం

చంద్రబాబు పై జగన్ మరో సారి ఫైర్. బాబును ఉరి తీయాలన్న జగన్.

వైసీపి అధ్య‌క్షుడు జ‌గ‌న్ చంద్ర‌బాబును ఉరి తీయాల‌ని మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టికే ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ను కాల్చి చంపినా తప్పు లేదంటూ నంద్యాలలో జరిగిన సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న మ‌రోసారి బాబు పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు.

 నంద్యాల స‌భ‌లో జ‌గ‌న్ మాట‌ల‌కు ఈసీ వ‌ద్ద వివ‌ర‌ణ ఇవ్వాల్సి వ‌చ్చింది. వివ‌ర‌ణ‌లో ఆయ‌న త‌న ఉద్దేశ్యం అది కాద‌ని తెలిపారు. కానీ తిరిగి అదే ప్ర‌చారంలో జ‌గ‌న్, చంద్ర‌బాబును ఉరితీయాల‌ని ఆరోపించారు. ఇదంతా చూస్తుంటే జ‌గ‌న్, బాబు మీద ఉద్దేశపూర్వ‌కంగానే అంటునట్లు టీడిపీ నేత‌లు చెబుతున్నారు. 

రెండ‌వ రోజు నంద్యాల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న గోస్పాడు మండలం దీబగుంట్లలో రోడ్ షో నిర్వ‌హించారు. జ‌గ‌న్‌ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు. ఆయ‌న బాబు పై విరుచుకుప‌డ్డారు. రాష్ట్రంలో మూడేళ్లుగా మోసపూరిత పాలన కొనసాగుతోందని, అందుకు సీఎం చంద్రబాబును ఉరి తీసినా తప్పు లేదని జగన్ వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికే బాబును కాల్చి చంపాల‌న్న వ్యాఖ్య‌ల‌కు టీడీపీ పార్టీ నేత‌లు త‌ప్పుబ‌ట్టారు. జ‌గ‌న్ ప్లేక్సీల‌ను త‌గ‌ల‌బెట్టారు. మ‌రీ ఇప్పుడు జ‌గ‌న్ తాజాగా చేసిన కామెంట్ల‌కు టీడీపీ నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.  
 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu