(వీడియో) ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మంత్రులెవరబ్బా?

First Published Aug 10, 2017, 3:54 PM IST
Highlights
  • పలువురు మంత్రులపై నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఫిర్యాదులు అందినట్లు ఎన్నికల కమీషనర్ బన్వర్ లాల్  చెప్పారు.
  • ఉపఎన్నిక షెడ్యూల్ కు ముందునుండే చంద్రబాబునాయుడుతో సహా మంత్రుల్లో చాలా మంది నంద్యాలలోనే క్యాంపు వేసిన సంగతి అందరికీ తెలిసిందే.
  • ఓటర్లను సామాజికవర్గాల వారీగా టిడిపి విడదీసింది. సామాజిక వర్గాలను అందులోనూ ఎవరికైనా పదోట్లున్నాయనుకుంటే వారిని మరింత ప్రత్యేకంగా చూసుకుంటోంది.

రాష్ట్రంలో బాగా హీటెక్కిస్తున్న నంద్యాల ఉపఎన్నకలో మంత్రులు యధేచ్చగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. పలువురు మంత్రులపై నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఫిర్యాదులు అందినట్లు ఎన్నికల కమీషనర్ బన్వర్ లాల్  చెప్పారు. ఉపఎన్నిక షెడ్యూల్ కు ముందునుండే చంద్రబాబునాయుడుతో సహా మంత్రుల్లో చాలా మంది నంద్యాలలోనే క్యాంపు వేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఓటర్లను సామాజికవర్గాల వారీగా టిడిపి విడదీసింది. సామాజిక వర్గాలను అందులోనూ ఎవరికైనా పదోట్లున్నాయనుకుంటే వారిని మరింత ప్రత్యేకంగా చూసుకుంటోంది.

ఈ విషయమై చంద్రబాబే దగ్గరుండి మరీ వ్యవహారం నడిపిస్తున్నారు. దాంతో మంత్రులు, నేతలు, అధికారుల సాయంతో రెచ్చిపోతున్నారు. ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు ఎంత మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోవటం లేదు. అయితే, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత టిడిపి జోరు కాస్త తగ్గినా ప్రలోభాల పర్వమైతే ఆగలేదు. ఇప్పటికీ మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు మండలాల వారీగా సామాజికవర్గ నేతలను కలుస్తూనే ఉన్నారు. చివరకు మతాల వారీగా కూడా సమావేశాలు పెట్టీ మరీ ప్రలోభాలకు దిగుతున్నారు.

సరే, అధికారంలో ఉన్నవారికి ఇదంతా మామూలే అనుకోండి, ఏం చేస్తాం. ‘ మీరు ఏం చేస్తారో చేసుకోండి...మేం చేయదలచుకున్నదే చేస్తాం’ అన్నట్లుంది మంత్రుల వ్యవహారం. అదే విషయమై గురువారం బన్వర్ లాల్ మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి మంత్రులు, కొందరు నేతలపై ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. రెండు మూడు రోజుల్లో వారి పేర్లు, వారిపై ఏం యాక్షన్ తీసుకుంటున్నామో ప్రకటిస్తామని స్పష్టం చేసారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై మొత్తం 44 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. వ్యక్తిదూషణలు వద్దని బుద్దులు చెప్పారు.

ఎన్నికలు సజావుగా సాగటానికి 8 సెంట్రల్ ఫోర్సెస్ కావాలని రిక్వెస్ట్ పంపినట్లు తెలిపారు. లేకపోతే స్టేట్ స్పెషల్ పోలీసు బలగాలైనా వస్తాయన్నారు. ప్రతీ పోలింగ్ బూత్ లోనూ ఓటింగ్ ప్రక్రియను వీడియోలు తీయిస్తున్నట్లు చెప్పారులేండి. సరే, మంత్రులెవరూ అధికార యంత్రాగాన్ని ఉపయోగించకూడదనే పాత విషయాన్నే మళ్ళీ చెప్పారు. ఎంతమంది మంత్రులు కోడ్ ఉల్లంఘించారని బన్వర్ లాల్ చెబుతారో చూడాలి.

click me!