పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ఆఫీసులో ఐటీ సోదాలు

By telugu teamFirst Published Feb 7, 2020, 1:32 PM IST
Highlights

టీడీపీ నేత, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు పత్తిపాటి శరత్ కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు కడప టీడీపీ నేత శ్రీనివాసులు రెడ్డి కెంపనీలో కూడా సోదాలు జరుగుతున్నాయి.

హైదరాబాద్: మాజీ మంత్రి, టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావు కుమారుడు పత్తిపాటి శరత్ కు చెందిన అవేక్సా కార్పోరేషన్ కంపెనీలో ఆదాయం పన్ను (ఐటి) సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో గల ఆయన కంపెనీలో ఐటి అధికారులు సోదాలు చేపట్టారు.

ఇదిలావుంటే, హైదరాబాదులోని మాదాపూర్ లో గల డీఎన్సీ ఇన్ ఫ్రా కంపెనీ డైరెక్టర్ ను అరెస్టు చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ జీఎస్టీ ఇంటలిజన్స్ (డీజీజీఐ) ప్రకటించింది. తప్పుడు ఇన్ఫాయిస్ లు సృష్టించి 69 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఈ మేరకు చర్య తీసుకున్నట్లు వెల్లడించింది. టీడీపీ నేతలకు సన్నిహితుడైన కిలారి రాజేశ్ కు చెందిన రెండు ఇన్ ఫ్రా కంపెనీల్లో కూడా ఐటి  సోదాలు జరుగుతున్నాయి.

Also Read: నారాయణ, పత్తిపాటిలపై కేసు: బాబు మాజీ పీఎస్ ఇంట్లో రెండో రోజూ సోదాలు

తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రనివాసులు రెడ్డి (వాసు) హైదరాబాదు కార్యాలయంలో శుక్రవారంనాడు కూడా ఐటీ సోదాలు జరిగాయి. ఆయన కార్యాలయం నుంచి పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కడపలోని ద్వారకా నగర్ లో గల శ్రీనివాసులు రెడ్డి నివాసంలో దాదాపు 30 గంటల పాటు సోదాలు జరిగాయి. 

సోదాల అనంతరం మీడియాతో మాట్లాడుకుండా ఐటి అధికారులు వెళ్లిపోయారు. శ్రీనివాసులు రెడ్డి ఎక్కడ ఉన్నాడనేది తెలియడం లేదు. ఆర్కే ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో శ్రీనివాసులు రెడ్డి జరిపిన ఆర్థిక లావాదేవీలపై, ఆదాయం పన్ను చెల్లింపులపై అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది.  

See video: చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ ఇంటిమీద ఐటీ దాడులు

click me!