ఏపీ శాసనమండలి రద్దు విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ: ఏపీ శాసనమండలి రద్దు విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
శుక్రవారం నాడు రాజ్యసభలో ఏపీ శాసనమండలి రద్దు అంశాన్ని ఎంపీ రవీంద్రకుమార్ ప్రస్తావించారు. పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడంతో శాసనమండలిని రద్దు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకొన్నారని ఎంపీ ఆరోపించారు.
undefined
Also read:ఏపీ శాసనమండలిలో సెలెక్ట్ కమిటీలు: సభ్యులు వీరే
ఏపీ శాసనమండలి రద్దు చేయడం పార్లమెంట్ నియమ నిబంధనలకు విరుద్దమని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ ఈ ఏడాది జనవరి 27వ తేదీన రద్దు చేసింది. ఈ తీర్మానాన్ని అదే రోజున కేంద్రానికి ఈ తీర్మానం కాపీని ఏపీ ప్రభుత్వం పంపింది.
శాసనమండలి రద్దును టీడీపీ వ్యతిరేకిస్తోంది.ఇదే విషయాన్ని రాజ్యసభలో కనకమేడల రవీంద్రకుమార్ ప్రస్తావించారు. శాసనమండలిని రద్దుపై ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానం పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందాల్సి ఉంది.పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందితే రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారు.