(వీడియో) విద్యార్ధిని కొడుతున్న కాలేజీ ఏదో తెలుసా ?

Published : Oct 20, 2017, 07:03 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
(వీడియో) విద్యార్ధిని కొడుతున్న కాలేజీ ఏదో తెలుసా ?

సారాంశం

చంద్రబాబు రివ్యూ చేస్తున్న సమయంలోనే ఓ వీడియో సర్క్యులేషన్లోకి వచ్చింది. ఇంతకీ ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే ? ఓ కార్పొరేట్ విద్యాసంస్ధలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్ధిని అధ్యాపకుడు కొడుతున్న దృశ్యం. కొట్టటమంటే మామూలుగా కాదు. ఏదో కసితో కొడుతున్నాడు.

ఓ నాలుగు రోజుల క్రితం కార్పొరేట్ విద్యాసంస్ధలపై చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. కార్పొరేట్ విద్యాసంస్ధల్లో చదువుతున్న విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోవటంపై కలకలం రేగిన సంగతి అందరికీ తెలిసిందే. అందులోనూ నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్ధల్లోని విద్యార్ధులే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటుడటంతో రాష్ట్రం అట్టుడుకిపోయింది. దాంతో తప్పనిస్ధితిలో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

అయితే, చంద్రబాబు రివ్యూ చేస్తున్న సమయంలోనే ఓ వీడియో సర్క్యులేషన్లోకి వచ్చింది. ఇంతకీ ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే ? ఓ కార్పొరేట్ విద్యాసంస్ధలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్ధిని అధ్యాపకుడు కొడుతున్న దృశ్యం. కొట్టటమంటే మామూలుగా కాదు. ఏదో కసితో కొడుతున్నాడు.

                                                                        

అప్పట్లో ఆ వీడియో వైరల్ అయ్యింది. అప్పట్లో ఆ కాలేజి ఏంటో ఎవరికీ అర్ధం కాలేదు. అయితే, చివరకి తేలిందంటేంటే, విశాఖపట్నంలోని రామాటాకీస్ రోడ్ లోని ద్వారకా నగర్ లో ఉండే శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ అట. కొడుతున్నది కెమిస్ట్రీ లెక్షిరర్ అట. మరి, ముఖ్యమంత్రో లేక ఉన్నతాధికారులో కాలేజీపై ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి? విద్యార్థి ని ఇంతదారుణంగా కొట్టిన లెక్చరర్ పై హత్యా యత్నం కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్ చేస్తున్నారు

PREV
click me!

Recommended Stories

Pemmasani Speech: రజతోత్సవ కార్యక్రమంలోపెమ్మసాని అదిరిపోయే స్పీచ్ | Cancer Hospital Silver Jubilee
ఎవర్ గ్రీన్ హీరో బాలయ్య చంద్రబాబు పంచ్ లకి పడిపడి నవ్విన బాలయ్య | CM Chandrababu Speech | Balayya