(వీడియో) రండిబాబు..రండి...ఏపిలో పెట్టుబడులు పెట్టండి

First Published Oct 20, 2017, 4:41 PM IST
Highlights
  • ఆంద్రప్రదేశ్ శాంతియుతమైన, అత్యున్నత మానవ వనరులు కలిగిన, స్నేహపూర్వక రాష్ట్రమన్నారు.
  • ఇక్కడ పెట్టుబడులు పెట్టిన పారిశ్రామిక వేత్తలను అడిగితే తెలుస్తుందని చెప్పారు.
  • ఆంద్రప్రదేశ్ ఎంత స్నేహపూర్వకంగా ఉంటుందో వారెంత సంతోషంగా ఉన్నారన్న విషయం అందరికీ తెలుసన్నారు.
  • కాబట్టి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులతో ఏపీ కి వచ్చి అక్కడి పరిస్ధితులను  ప్రత్యక్షంగా తెలుసుకోవాలని ఆహ్వానించారు.  

అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు పారిశ్రామిక వేత్తలతోను, వ్యవసాయ రంగానికి చెందిన శాస్త్రవేత్తలు, విత్తనోత్పత్తి సంస్ధల సిఎఫ్ వోలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆంద్రప్రదేశ్ శాంతియుతమైన, అత్యున్నత మానవ వనరులు కలిగిన, స్నేహపూర్వక రాష్ట్రమన్నారు.

ఇక్కడ పెట్టుబడులు పెట్టిన పారిశ్రామిక వేత్తలను అడిగితే తెలుస్తుందని చెప్పారు. ఆంద్రప్రదేశ్ ఎంత స్నేహపూర్వకంగా ఉంటుందో వారెంత సంతోషంగా ఉన్నారన్న విషయం అందరికీ తెలుసన్నారు. కాబట్టి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులతో ఏపీ కి రావాలని అక్కడి పరిస్ధితులను  ప్రత్యక్షంగా తెలుసుకోవాలని ఆహ్వానించారు.  

తర్వాత రాష్ట్ర విభజన తర్వాత నూతన ఆంద్రప్రదేశ్ లో గ్రీన్ ఫీల్డ్ రాజధాని అమరావతి నిర్మించుకుంటున్నట్లు చెప్పారు. నాలెడ్జ్ స్టేట్ గా రాష్ట్రానికున్న పేరును నిలబెట్టుకుంటూనే నాలెడ్జ్ ఎకానమీ వైపు దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. నూతన ఆంద్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమన్నారు.

వ్యవసాయ రంగంలో పెద్దఎత్తున సాంకేతికతను మేళవించి రైతుకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టామన్నారు. దేశంలోనే తొలిసారిగా నదుల అనుసంధానం జరిపామని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో వినూత్న పద్ధతులు అనుసరిస్తూనే ఉద్యాన, పశుగణాభివృద్ది, మత్స్యశాఖల అభివృద్ధిపై కూడా ప్రత్యేక శ్రద్ద పెట్టినట్లు తెలిపారు.

వ్యవసాయ రంగంలో పెద్దయెత్తున యాంత్రీకరణ చేపట్టమన్నారు. డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సహిస్తున్న విషయాన్ని తెలిపారు. నవంబరు నెలలో రాష్ట్రంలో జరిగే అంతర్జాతీయ వ్యవసాయ సదస్సుకు బిల్, మిలిందా గేట్స్ హాజరవుతున్నారని ప్రకటించారు.

వ్యవసాయ రంగంపై అత్యంత శ్రద్ద పెట్టినట్లు చెప్పారు. కొన్ని రోజుల క్రితం మెగా సీడ్ పార్కుకు శంకుస్థాపన చేసామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపి మొదటి స్థానంలో ఉందన్నారు.  పాలనలో పారదర్శకత కోసం ఆన్ లైన్ విధానాన్ని అమలు చేసినట్లు చెప్పారు.

సాంకేతితను మేళవించి సమర్ధవంతమైన రియల్ టైం పాలన అందిస్తున్నట్లు చెప్పారు. రాబోయే 15, 20 ఏళ్ల పాటు 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నామని,  ప్రస్తుతం భారత దేశ సగటు వృద్ధి రేటు కంటే రెట్టింపు 11.72 శాతం సాధించామని చంద్రబాబు చెప్పారు.

click me!