టిడిపి ఎన్నికలకు రెడీనా?

Published : Apr 21, 2017, 10:20 AM ISTUpdated : Mar 25, 2018, 11:48 PM IST
టిడిపి ఎన్నికలకు రెడీనా?

సారాంశం

ఒకేసారి రెండు ఎన్నికలూ జరిపించేసి వైసీపీని మట్టి కరిపించేస్తే ఇక ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి నోరెత్తరు కదా?

తెలుగుదేశం పార్టీకి ఓట్లశాతం పెరిగిందట. రాష్ట్రంలోని వివిధ పార్టీల బలాబలాలను గతేడాదితో పోల్చుకుంటే టిడిపికి 16.13 శాతం ఓట్ల పెరిగిందట. ఇది ఎవరో చెప్పింది కాదు. సాక్షాత్తు చంద్రబాబునాయుడే చెప్పారు. ఈరోజు జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో స్పష్టంగా నేతలతో చెప్పారు. ఏ ప్రాతిపదికన చెప్పారో మాత్రం ఎవ్వరికీ తెలీదు. రాష్ట్రం మొత్తం మీద పార్టీకి ఓట్లశాతం పెరిగిందని చెప్పటానికి హేతువు ఏమిటో కూడా ఎవరికీ అర్ధం కావటం లేదు. చంద్రబాబు చెప్పారంటే నిజంగానే పెరిగుంటుందనే అనుకుందాం? టిడిపికి పెరిగటంతో పాటు  వైసీపీకి తగ్గిందని కూడా సిఎమ్మే చెప్పారు.

మరి ఒక్కసారిగా టిడిపి ఓట్లశాతం అంతగా పెరిగి, ప్రతిపక్ష వైసీపీకి ఓట్లశాతం తగ్గితే ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మున్సిపల్ ఎన్నికలు, ఫిరాయింపు ఎంఎల్ఏలతో రాజీనామాలు చేయించి ఆ నియోజకవర్గాల్లోనూ ఎన్నికలకు వెళ్ళవచ్చు కదా? మున్సిపల్ ఎన్నికలేమో దాదాపు ఏడాదిన్నరగా పెండిగిలో ఉన్నాయి. ఇక ఫిరాయింపు ఎంఎల్ఏలతో రాజీనామాలు చేయించమని వైసీపీ డిమాండ్ చేస్తున్నదే కదా? ఒకేసారి రెండు ఎన్నికలూ జరిపించేసి వైసీపీని మట్టి కరిపించేస్తే ఇక ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి నోరెత్తరు కదా?

PREV
click me!

Recommended Stories

YS Jagan Comments: అలా చేయడం బాబుకే సాధ్యం జగన్ కీలక కామెన్స్ కామెంట్స్| Asianet News Telugu
YS Jagan Comments on Chandrababu: ఇది ప్రభుత్వమా జంగిల్ రాజ్యమా:జగన్ | Asianet News Telugu