చంద్రబాబు ఇరుక్కున్నట్లేనా?

First Published Jun 5, 2017, 2:36 PM IST
Highlights

భాజపా శాసనసభా నేత విష్ణుకుమార్ రాజు ఈరోజు మాట్లాడుతూ, తన భూములను కూడా టిడిపి నేతలు కబ్జా చేసారంటూ చేసిన ఆరోపణలు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇబ్బందులకు గురిచేసేదే. టిడిపికి చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు వేల ఎకరాలను కబ్జా చేసారంటూ మొదటి నుండి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.

విశాఖపట్నం జిల్లాలో వెలుగు చూసిన భూ కుంభకోణంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వ ఇరుక్కున్నట్లే కనబడుతోంది. ప్రజాప్రతినిధులు, నేతలు కబ్జా చేసిన వేలాదిఎకరాల భూకుంభకోణం చంద్రబాబు మెడకు చుట్టుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. భూకుంభకోణంపై అత్యున్నత విచారణకు అదేశించక తప్పేట్లు లేదు.

భూ కుంభకోణంపై ప్రభుత్వం ఇప్పటి వరకూ పైకి భింకంగా కనిపిస్తున్నా లోపల మాత్రం తీవ్ర ఆందోళన పడుతున్నట్లే ఉంది. కుంభకోణంలో పూర్తిగా అదికార పార్టీ ప్రజాప్రతినిధులు కూరుకుపోవటంతో ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పేలా లేదు.

కుంభకోణం జరిగినట్లు ప్రాధమికంగా అధికారులే నిర్ధారించారు. భీమిలీ తదితర నియోజకవర్గాల్లో సుమారు రూ. 25 వేల కోట్ల విలువైన  7 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారపార్టీ నేతలే సొంతం చేసేసుకున్నారు.

మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు ఎంఎల్ఏలు వెలగపూడి రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తితో పాటు మరో ఇద్దరు ప్రజా ప్రతినిధులు భూములను సొంతం చేసేసుకున్నారన్నది ఆరోపణలు.

ఇంతకాలం ప్రతిపక్షం మాత్రమే ఆరోపణలు చేస్తుండగా తాజాగా మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ కూడా తోడైంది. భాజపా శాసనసభా నేత విష్ణుకుమార్ రాజు ఈరోజు మాట్లాడుతూ, తన భూములను కూడా టిడిపి నేతలు కబ్జా చేసారంటూ చేసిన ఆరోపణలు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇబ్బందులకు గురిచేసేదే.

టిడిపికి చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు వేల ఎకరాలను కబ్జా చేసారంటూ మొదటి నుండి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. కాకపోతే చింతకాయల ఎవరిపేర్లు బయటకు చెప్పలేదంటే.

ఈరోజు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, టిడిపి నేతలు కబ్జా చేసిన భూముల విలువ రూ. 4 లక్షల కోట్లుంటుందని ఆరోపించటం గమనార్హం. సరే, ఎవరు ఆరోపణలు చేస్తున్నా అంతిమంగా కుంభకోణానికి సూత్రదారి నారా లోకేషే అని చెబుతుండటం గమనార్హం.

కుంభకోణం విలువ రీత్యా, మిత్రపక్షం కూడా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోంది కాబట్టి అందరూ డిమాండ్ చేస్తున్నట్లు సిబిఐ విచారణ తప్పేట్లు లేదు. అదే జరిగితే చంద్రబాబుకు ఇబ్బందులు మొదలైనట్లే.

click me!