నంద్యాల వైసిపి ఎంపిగా కాటసాని ?

First Published Apr 11, 2018, 3:32 PM IST
Highlights
ప్రస్తుతం బిజెపిలో ఉన్న కాటసాని త్వరలో వైసిపిలో చేరటానికి దాదాపు రంగం సిద్ధమైందని సమాచారం.

కర్నూలు జిల్లాలో ప్రచారంలో ఉన్న వార్త నిజమైతే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నంద్యాల ఎంపిగా పోటీ చేసే అవకాశాలున్నాయ్. ప్రస్తుతం బిజెపిలో ఉన్న కాటసాని త్వరలో వైసిపిలో చేరటానికి దాదాపు రంగం సిద్ధమైందని సమాచారం.

అదే విషయమై ఫైనల్ చేసేందుకు ఈనెల 18వ తేదీన తన మద్దతుదారులతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు.

కాటసానిని వైసిపిలోకి చేర్చుకోవటానికి పార్టీలోని నేతలకు కూడా ఎటువంటి అభ్యంతరాలున్నట్లు లేదు. కాకపోతే కాటసానిని ఎక్కడ అకామిడేట్ చేస్తారన్నదే సస్పెన్స్. వైసిపి వర్గాల ప్రకారమైతే మొదటి అవకాశమైతే పాణ్యం అసెంబ్లీకే. అది కుదరకపోతే నంద్యాల ఎంపిగా పోటీ చేయిస్తారట.

ప్రస్తుతం వైసిపి పాణ్యం ఎంఎల్ఏగా గౌరు చరితారెడ్డి ఉన్నారు. పోయిన ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధిగా చరిత పోటీ చేయగా స్వతంత్ర అభ్యర్ధిగా ఓడిపోయిన కాటసానికి సుమారు 60 వేల ఓట్లొచ్చాయి. నియోజకవర్గంపై కాటసానికున్న పట్టేంటో ఆయనకు వచ్చిన ఓట్లే చెబుతున్నాయి.

ఇక, బిజెపిలో ఉండి ఉపయోగం లేదని కాటసాని మద్దతుదారులు కూడా గట్టిగా చెబుతున్నారట.

అందుకనే కాటసాని కూడా వైసిపిలో చేరటానికి మొగ్గు చూపుతున్నారు. జగన్ పాదయాత్రలో భాగంగానే కాటసాని ఎక్కడో అక్కడ వైసిపి కండువా కప్పుకోవటం ఖాయమని తెలుస్తోంది.

click me!