అభ్యర్ధులను రెడీ చేసుకుంటున్న భాజపా

First Published Aug 5, 2017, 7:46 AM IST
Highlights
  • పోటీ చేయించటంలో భాగంగా అభ్యర్ధులను కూడా సిద్ధం చేసుకుంటోందా? అవుననే అంటున్నారు భాజపా నేతలు.
  • వచ్చే ఎన్నికల్లో ఒంటరిపోటీ చేయటానికి వీలుగా ఇప్పటి నుండే అన్నీ నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులను నిలపటానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు కమలం పార్టీ నేతలే చెబుతున్నారు.
  • ఇప్పటికే బూత్ స్ధాయిలో వేలాదిమంది నేతలను సిద్దం చేసుకున్న విషయాన్ని గుర్తుచేసారు.

రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అన్నీ నియోజకవర్గాల్లో పోటీచేస్తోందా? పోటీ చేయించటంలో భాగంగా అభ్యర్ధులను కూడా సిద్ధం చేసుకుంటోందా? అవుననే అంటున్నారు భాజపా నేతలు. వీరి మాటలను బట్టి వచ్చే ఎన్నికల్లో టిడిపితో పొత్తుండదనే అనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిపోటీ చేయటానికి వీలుగా ఇప్పటి నుండే అన్నీ నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులను నిలపటానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు కమలం పార్టీ నేతలే చెబుతున్నారు. విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోటలో భాజపా రాష్ట్ర కార్యదర్శి పాకలపాటి సన్యాసిరాజు మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో భాజపా ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేసారు.

పార్టీని బలోపేతం చేసుకోవటంలో భాగంగానే పార్టీని గ్రామస్ధాయి నుండి గట్టి కార్యకర్తలను సిద్ధం చేసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే బూత్ స్ధాయిలో వేలాదిమంది నేతలను సిద్దం చేసుకున్న విషయాన్ని గుర్తుచేసారు. టిడిపితో కలిసి పోటీ చేయటం తమ పార్టీలో ఏ ఒక్కరికీ ఇష్టం లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. టిడిపి వైఖరి చూస్తుంటే తమ పార్టీ నేతలు దాసోహమనాలనే భావనలో ఉన్నట్లు కనబడుతోందని కూడా అన్నారు. విజయనగరం జిల్లాలోని మొత్తం 9 నియోజకవర్గాల్లోనూ సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి అభ్యర్ధులను దింపనున్నట్లు సన్యాసిరాజు స్పష్టం చేసారు.

click me!