
వైసీసి అధ్యక్షుడు జగన్, ముఖ్యమంత్రి చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలు ఇరు పార్టీల మధ్య చిచ్చు పెడుతున్నాయి. జగన్ నంద్యాల సభలో బాబును రోడ్డు మీద కాల్చీ చంపేయాలి అన్న విమర్శకు రెండు పార్టీల మధ్య రాజకీయంగా మాటల యుద్దం ప్రారంభమైంది.
వైసీపి అధ్యక్షడు జగన్ గురువారం సాయంత్రం బాబు పైన కామెంట్ చేస్తే శుక్రవారం సాయంత్రం వరకు ఇరు పార్టీల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుకుంది. కుటుంబాలే లక్ష్యంగా మాటల తూటాలు పెలుతున్నాయి. జగన్ బాబుపై చేసిన విమర్శకు టిడిపి శ్రేణులు నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకి దిగారు. జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. జగన్ తన అవసరానికి తండ్రిని, తల్లిని, చెల్లిని పావులుగా వాడుకుంటాడని టిడిపి శ్రేణులు విమర్శించాయి.
అందుకు వైసీపి నుండి ఎమ్మేల్యే రోజా.. బాబు పై వ్యక్తిగత దాడికి దిగింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి చంద్రబాబు కారణం అని విమర్శించింది. రోజా మాటలకు టిడిపి నాయకురాలు పి. అనురాధ తిరిగి మాటల యుద్దం కొనసాగించింది. జగన్ కుటుంబ చరిత్ర నీచమైనదని విమర్శించింది.
మొదటి నుండి వైసీపి నేతలు చంద్రబాబే టార్గెట్ గా తమ మాటలకు పదును పెట్టారు. చంద్రబాబుది ఎన్నుపోటు పొడిచే సంస్కృతని వారు విమర్శించారు వైపీపి నేతలు విరుచుకుపడ్డారు. ప్రజలు బాబు ను ఎన్ని సార్లు నమ్మిన వంచంచే నైజాం మాత్రం మానడం లేదని దూషించారు.
ఇక జగన్ ను కూడా టిడిపి శ్రేణులు కూడా వైసీపి పై దాడి చేశారు. జగన్ అవినీతికి పరాకాష్ట అని ఆయన 16 నెలలు జైళ్లో ఉన్నా ఇప్పటికి తన వైకరిలో మార్పు రావడం లేదని ధ్వజమెత్తారు.
ఇరు పార్టీల పరస్పర దూషణల వలన ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. ఇప్పుడు జరుగుతున్న రెండు పార్టీల మధ్య మాటల యుద్దం ఎక్కడి నుండి ఎక్కడికి దారీ తీస్తుందో చూడాలి.