అఖిల ఫిర్యాదు పనిచేసినట్లుంది

Published : Jul 19, 2017, 12:21 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
అఖిల ఫిర్యాదు పనిచేసినట్లుంది

సారాంశం

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలను చంద్రబాబుకు ఫిర్యాదు చేసారట. దాని ఫలితమే ఎన్నికల కేంద్ర కార్యాలయం ఏర్పాటు.  నంద్యాలలో పర్యటించే మంత్రులు కానీ నేతలు కానీ ఎవరి ఇంట్లోనూ దిగేందుకు లేదని, హోటళ్లలో బస చేసేందుకు లేదని చంద్రబాబు స్పష్టంగా ఆదేశించారట. ఎన్నికల వ్యవహారాలు, మంత్రులు, నేతల సమావేశాల, మీడియా సమావేశాలు సమస్తం కొత్త కార్యాలయంలోనే జరగాలని స్పష్టంగా చెప్పారట.

నంద్యాల ఉపఎన్నిక ప్రచారం విషయంలో మంత్రి అఖిలప్రియ పిర్యాదు పనిచేసినట్లే ఉంది. వైఎస్ఆర్ జంక్షన్లో ఎన్నికల నిర్వహణకోసం టిడిపి బుధవారం ఓ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఉపఎన్నిక ప్రచారంలో తనను అందరూ కలిసి ఒంటరిని చేసారంటూ అఖిలప్రియ ఆమధ్య చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేసారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఉపఎన్నిక విషయంలో స్ధానిక నేత, భూమా నాగిరెడ్డికి ప్రధాన అనుచరుడైన ఏవి సుబ్బారెడ్డి మంత్రులను, ఎన్నిక వ్యవహారాలను హైజాక్ చేసినట్లుగా అఖిల సిఎంకు ఫిర్యాదు చేసిందని ప్రచారంలో ఉంది.

ప్రచారం నిమ్మితం నంద్యాలకు మంత్రులెవరు వచ్చినా తన ఇంట్లోనో లేక హోటల్లోనో ఏవి దింపుతున్నారు. వివిధ కారణాల వల్ల అఖిల ఏవి ఇంటికి గానీ హోటల్ కు గానీ వెళ్ళలేకపోతున్నారు. దానికితోడు మంత్రులు కూడా అఖిలను పెద్దగా పట్టించుకోవటం లేదు. దాన్ని అవకాశంగా తీసుకుని సుబ్బారెడ్డి ఎన్నికను ఒకవిధంగా హైజాక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో అఖిలకు బాగా ఇబ్బందైంది.

ఉపఎన్నిక జరుగుతున్నది తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన నంద్యాల నియోజకవర్గంలో. అందుకే అన్నీ తానై ముందుండి నడిపించాలనుకున్నారు. కానీ పరిస్ధితులు అఖిల ఆలోచనలకు భిన్నంగా జరగుతున్నాయి. తనకు సంబంధంలేకుండా ఉపఎన్నిక వ్యవహారాలు జరిగిపోతుండటాన్ని జీర్ణించుకోలేకపోయారు. దాంతో క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలను చంద్రబాబుకు ఫిర్యాదు చేసారట. దాని ఫలితమే ఎన్నికల కేంద్ర కార్యాలయం ఏర్పాటు.

నంద్యాలలో పర్యటించే మంత్రులు కానీ నేతలు కానీ ఎవరి ఇంట్లోనూ దిగేందుకు లేదని, హోటళ్లలో బస చేసేందుకు లేదని చంద్రబాబు స్పష్టంగా ఆదేశించారట. ఎన్నికల వ్యవహారాలు, మంత్రులు, నేతల సమావేశాల, మీడియా సమావేశాలు సమస్తం కొత్త కార్యాలయంలోనే జరగాలని స్పష్టంగా చెప్పారట. మొత్తం మీద అఖిలప్రియ ఫిర్యాదు బాగనే పనిచేసినట్లుంది.

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్