ఆన్ లైన్ బెట్టింగుల్లో అప్పులు.. ఇంటర్ విద్యార్థి కిడ్నాప్ డ్రామా??

Published : Dec 09, 2021, 01:09 PM IST
ఆన్ లైన్ బెట్టింగుల్లో అప్పులు.. ఇంటర్ విద్యార్థి కిడ్నాప్ డ్రామా??

సారాంశం

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం ఇడుపూర్ కు చెందిన ఇంటర్ విద్యార్థి నాసర్ వలీ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే ఈ కేసును మొదట పోలీసులు లైట్ గా తీసుకున్నారు. రాత్రి వరకూ కూడా రాకపోవడంతో విచారణ ప్రారంభించారు. వలీ ఫ్రెండ్స్ ను విచారిస్తే అసలు సంగతి తెలిసింది. తనని కిడ్నాప్ చేశారని.. లక్ష రూపాయలు డిమాండ్ చేస్తున్నారని ఫ్రెండ్స్ WhatsApp లకు మేసేజ్ లు వచ్చాయి. 

ప్రకాశం :  ఆన్ లైన్ లో బెట్టింగులు పెట్టి.. లక్ష రూపాయలు అప్పు చేశాను. ఇంట్లో డబ్బులు అడిగితే తిడతారు. అందుకే కనిపించకుండా పోయా.. Prakasam Districtలో ఓ Inter student వాట్సాప్ లో ఫ్రెండ్ కు పంపిన మెసేజ్ లు ఇవి. Kidnap కు గురయ్యాడని భావిస్తున్న విద్యార్థి కేసులో వెలుగు చూస్తున్న కొత్త విషయాలతో పోలీసులు షాక్ అవుతున్నారు. 

అయితే స్టూడెంట్ ఒక్కడే ఈ Drama ఆడుతున్నాడా? అతనికి ఎవరైనా సహకరిస్తున్నారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం ఇడుపూర్ కు చెందిన ఇంటర్ విద్యార్థి నాసర్ వలీ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది.

అయితే ఈ కేసును మొదట పోలీసులు లైట్ గా తీసుకున్నారు. రాత్రి వరకూ కూడా రాకపోవడంతో విచారణ ప్రారంభించారు. వలీ ఫ్రెండ్స్ ను విచారిస్తే అసలు సంగతి తెలిసింది. తనని కిడ్నాప్ చేశారని.. లక్ష రూపాయలు డిమాండ్ చేస్తున్నారని ఫ్రెండ్స్ WhatsApp లకు మేసేజ్ లు వచ్చాయి. విద్యార్థి అప్పులు చేసి కిడ్నాప్ కు గురైనట్లు డ్రామా ఆడుతున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Visakhapatnam: విశాఖ మధురవాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..

ఇదిలా ఉండగా, హైదరాబాద్ లో ఓ ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్, సామూహిక అత్యాచారం కలకలం రేపింది. ఈ Minor Gang Rapeలో Auto driver కిరణ్ (22), సల్మాన్ (23), లింగా చారి (25), షేక్ ఫారుక్ (28), మహమ్మద్ ఇర్ఫాన్ (24) లను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో నిర్ఘాంతపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

సుల్తాన్ బజార్ పోలీసులు,  విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... అంబర్ పేట కు చెందిన ఆటోడ్రైవర్ కాలేజీ కి వెళ్తున్న  బాలిక (17)కు మాయమాటలు చెప్పి గత నెల 30న మూసీ పరివాహక ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ గడ్డి ఏపుగా, ఎత్తుగా పెరిగిన స్థలానికి తీసుకెళ్లి rapeకి పాల్పడ్డాడు 

Cheating: 15 కోట్ల చీటీ డ‌బ్బుల‌తో వ్యాపారి జంప్‌..

రాత్రంతా అక్కడే ఉండి తెల్లవారుజామున girlను అక్కడే వదిలేసి వచ్చాడు. అయితే ఆ తర్వాత రోజు అంబర్పేట్ పరిసర ప్రాంతాలకు చెందిన మరో ముగ్గురు ఒకరికి తెలియకుండా మరొకరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బండ్లగూడకు చెందిన మరో యువకుడు సైతం బాలిక నగర శివారు ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. 

నాలుగు రోజుల అనంతరం Chadar Ghatలో పోలీసుల కంట పడ్డ బాలిక మొదట నోరు విప్పలేదు. రెండు రోజుల తర్వాత జ్వరం రావడంతో భరోసా సెంటర్ కు తరలించారు. అక్కడ తనపై జరిగిన ఘోరాన్ని బయటపెట్టింది. బాలిక చెప్పిన వివరాల మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు నిందితులను రిమాండ్ కు తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu
Legendary Actor Krishnam Raju 86th Birth Anniversary | Free Mega Diabetes Camp | Asianet News Telugu