మంత్రి ఆదిమూలపు సురేష్ కాన్వాయ్ ఢీ కొని వ్యక్తి మృతి.. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న మృతుని భార్య

Published : Dec 09, 2021, 01:09 PM IST
మంత్రి ఆదిమూలపు సురేష్ కాన్వాయ్ ఢీ కొని వ్యక్తి మృతి.. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న మృతుని భార్య

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ (adimulapu suresh) కాన్వాయ్ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ప్రమాదంలో మృతుని భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని పెద్దారవీడు మండలం గొబ్బూరు సమీపంలో చోటుచేసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో (prakasam district) రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ (adimulapu suresh) కాన్వాయ్ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ప్రమాదంలో మృతుని భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన జిల్లాలోని పెద్దారవీడు మండలం గొబ్బూరు సమీపంలో చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న బైక్‌ను మంత్రి ఆదిమూలపు సురేష్ కాన్వాయ్‌లోని ఓ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 38 ఏళ్ల మహేష్ అనే వ్యక్తి మృతిచెందాడు. అతని భార్య‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?