విశాఖ ఫార్మాసిటీలో ప్రమాదం... ముందు వారిని కాపాడండి: గౌతమ్ రెడ్డి ఆదేశం

By Arun Kumar PFirst Published Jul 14, 2020, 11:51 AM IST
Highlights

విశాఖపట్నం ఫార్మాసిటీలో పేలుడుపై పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. 

అమరావతి: విశాఖపట్నం ఫార్మాసిటీలో పేలుడుపై పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. రాంకీ సీఈటీపీ సాల్వెంట్స్‌లో పేలుడుకు సంబంధించిన  వివరాలపై మంత్రి ఆరా తీశారు.  జిల్లా అధికార యంత్రాంగంతో ఫోన్ ద్వారా ప్రాథమిక సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. 

భారీ ఎత్తున మంటలు వ్యాపిస్తున్న తరుణంలో ముందు స్థానిక ప్రజలను, ఫార్మాసిటీ పరిధిలో రాత్రి విధుల్లో ఉన్నవారిని రక్షించడానికి కృషి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చూడాలని పోలీసు యంత్రాంగానికి, అగ్నిమాపక అధికారులకు మంత్రి సూచించారు. వైద్య, అగ్నిమాపక, పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే క్షతగాత్రులకు అవసరమైన వైద్య సదుపాయాలు సిద్ధం చేయాలన్న మంత్రి గౌతమ్ రెడ్డి ఆదేశించారు. 

read more   విశాఖ ఫార్మా సిటీలో ప్రమాదం: కెమిస్ట్ శ్రీనివాస్ గల్లంతు, ట్యాంకర్లు పేలి...

ఇక విశాఖపట్నం ఫార్మాసిటీలో జరిగిన పేలుడుపై హోంమంత్రి మేకతోటి సుచరిత తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కోస్టల్ వేస్ట్ మెనేజ్మెంట్ ప్రాజెక్ట్ పేలుడుకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. సంబంధిత అధికారులు, పోలీసుల నుండి సమాచారాన్ని అడిగి తెలుసుకున్న హోంమంత్రి...అప్రమత్తంగా వుండాలని సూచించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సుచరిత సూచించారు. 

మరో మంత్రి కురసాల కన్నబాబు కూడా విశాఖపట్నం ఫార్మాసిటీ పేలుడుపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ తో ఫొన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు, సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కన్నబాబు ఆదేశించారు. 

click me!