పోలీస్ స్టేషన్లోనే టిడిపి నాయకుడిపై దాడి... ఫోన్ చేసి ధైర్యం చెప్పిన చంద్రబాబు

Arun Kumar P   | Asianet News
Published : Jul 14, 2020, 11:16 AM ISTUpdated : Jul 14, 2020, 11:23 AM IST
పోలీస్ స్టేషన్లోనే టిడిపి నాయకుడిపై దాడి... ఫోన్ చేసి ధైర్యం చెప్పిన చంద్రబాబు

సారాంశం

టిడిపి నాయకుడు సుబ్రహ్మణ్య యాదవ్ పై వైసిపి నేతల దాడిని అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. 

చిత్తూరు: టిడిపి నాయకుడు సుబ్రహ్మణ్య యాదవ్ పై వైసిపి నేతల దాడిని అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. పోలీసులు బాధితులపైనే ఎదురు కేసులు పెట్టడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా చంద్రబాబే సుబ్రమణ్యం యాదవ్ కు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు.    

చంద్రగిరి నియోజకవర్గం ఆర్‌సి పురం మండలం పూజగారి పల్లె మాజీ సర్పంచి సుబ్రమణ్య యాదవ్ పై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా జులై 12న సుబ్రమణ్యంపై వైసిపి నాయకులు దాడిచేశారు. కేసు పెట్టడానికి స్టేషన్ కు వెళ్తే అక్కడ పోలీసుల ఎదుటే మళ్లీ దాడికి ప్రయత్నించారని అన్నారు. 

ఈ దాడిపై సుబ్రమణ్య యాదవ్ ఫిర్యాదు పోలీసులు స్వీకరించకుండా తిరిగి ఆయనపైనే వాలంటీర్లతో ఎదురు కేసు పెట్టించడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుబ్రమణ్యం యాదవ్ కొడుకును కూడా ఈ కేసులో ఇరికించడంపై మండిపడ్డారు. తప్పు చేసినవాళ్లపై చర్యలు తీసుకోకుండా బాధితులపైనే కేసులు బనాయించడం హేయంగా పేర్కొన్నారు. 

బీసి నాయకులపై వైసిపి చేస్తున్న దాడులను చంద్రబాబు ఖండించారు. దాడి గురించి తెలిసిన వెంటనే చంద్రబాబు సుబ్రమణ్యం యాదవ్ కు ఫోన్ చేసి పరామర్శించారు. వైసిపి దురాగతాలను ఖండించారు, టిడిపి అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. 

READ MORE   జగన్ కు చిక్కులు: చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేతుల్లోకి కాపు ఉద్యమం

ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు నెల్లూరు జిల్లా టిడిపి కార్యకర్త శ్రీకాంత్ రెడ్డికి పోలీసులు ఫోన్ చేసి బెదిరించే ప్రయత్నం చేయగా ఆయన ధీటుగా సమాధానం చెప్పారు. తాను ఏ తప్పు చెయ్యలేదు కాబట్టి బెదిరింపులకు లొంగేది లేదంటూ... చట్టప్రకారం ఏ చర్యలు తీసుకున్నా సిద్ధం అంటూ శ్రీకాంత్ రెడ్డి ఫోన్లోనే పోలీసులకు ధైర్యంగా సమాధానం చెప్పాడు. ఇలా ఆయన పోలీసులతో మాట్లాడిన ఫోన్ కాల్ సంబాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదికాస్తా టిడిపి అధినేత చంద్రబాబు దాకా వెళ్ళి స్వయంగా ఆయనే సదరు కార్యకర్తకు ఫోన్ చేసేలా చేసింది.  

శ్రీకాంత్ రెడ్డికి చంద్రబాబు ఫోన్ చేసి మరీ అభినందించారు చంద్రబాబు. బెదిరింపులకు లొంగకుండా చాలా ధైర్యంగా మాట్లాడావని... ఎలాంటి కష్టం వచ్చినా మీకు నేనున్నానంటూ ధైర్యం చెప్పారు. బెదిరింపులకు లొంగకుండా ధైర్యంగా భావ ప్రకటనా స్వేచ్ఛని కాపాడుకోవడానికి మాట్లాడిన తీరుని ప్రశంసించారు చంద్రబాబు. 

పోలీసు వ్యవస్థ ప్రజల్ని రక్షించే విదంగా ఉండాలని... కానీ వైసిపి ప్రభుత్వం బెదిరింపులకు, రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు వ్యవస్థను వాడుకోవడం దారుణమన్నారు. పోలీసు వ్యవస్థ లో పారదర్శకత కోసమే టిడిపి హయాంలో బాడీవోర్న్ కెమెరాలు ప్రవేశపెట్టామన్నారు. పౌరుల ప్రాథమిక హక్కులు కాలరాసే అధికారం ఎవ్వరికి లేదు... తప్పు చెయ్యని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదన్నారు చంద్రబాబు. 

రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలులో లేదని... రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. టిడిపి నేతల అరెస్టుల విషయంలో ఇది స్పష్టంగా అర్థం అవుతుందని పేర్కొన్నారు. కానీ ఒక కార్యకర్తగా మీరు పోలీసులకు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని గుర్తుచేసారని...ఈ ధైర్యానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానంటూ శ్రీకాంత్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు చంద్రబాబు. 


 

PREV
click me!

Recommended Stories

Spectacular Drone Show in Arasavalli మోదీ, చంద్రబాబు చిత్రాలతో అదరగొట్టిన డ్రోన్ షో | Asianet Telugu
Minister Atchannaidu: అరసవల్లిలో ఆదిత్యుని శోభాయాత్రను ప్రారంభించిన అచ్చెన్నాయుడు| Asianet Telugu