India Justice Report 2025: సత్తా చాటిన తెలుగు రాష్ట్రాలు.. ఏపీ, తెలంగాణ ఏ స్థానంలో ఉన్నాయంటే?

Published : Aug 09, 2025, 03:16 PM IST
Tamil Nadu police

సారాంశం

India Justice Report 2025: ఇండియా జస్టిస్ ర్యాంకింగ్స్‌ 2025 లో శాంతిభద్రత, పోలీసింగ్, న్యాయ సహాయ విభాగంలో తెలుగు రాష్టాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అద్వితీయ స్థానంలో నిలిచాయి. ఈ ర్యాంకింగ్ లో ఆంధ్రప్రదేశ్ 2వ, తెలంగాణ 3వ స్థానాల్లో నిలిచింది.

India Justice Report 2025:  తెలుగు రాష్ట్రాలు అద్భుతమైన ప్రదర్శనతో సత్తా చాటుతున్నాయి. ఇండియా జస్టిస్ ర్యాంకింగ్స్ 2025లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లు టాప్ ఫ్లేస్ లో నిలిచాయి. ఈ రాష్ట్రాలు ప్రజల కోసం న్యాయసహాయం, శాంతిభద్రతల నిర్వహణ, పోలీసింగ్ పనితీరు వంటి కీలక అంశాల్లో ముందంజలో ఉన్నాయి. భారత న్యాయ వ్యవస్థలో తమ ప్రభావాన్ని మరింత బలపరిచాయి. అయితే, ఈ ర్యాంకింగ్స్‌లో ఈ రెండు రాష్ట్రాలు ఎన్నో స్థానంలో నిలిచాయంటే?

తాజా ఇండియా జస్టిస్ రిపోర్టు 2025  (India Justice Report 2025)  ప్రకారం.. దేశంలోని న్యాయవ్యవస్థ పనితీరు, పోలీసింగ్ సామర్థ్యం, శాంతిభద్రతల నిర్వహణలో కర్ణాటక అగ్రస్థానంలో నిలిచింది. 10లో 6.78 స్కోరుతో కర్ణాటక ఫస్ట్ ఫ్లేస్ సంపాదించుకుంది. ఆ తరువాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ 6.32 స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. తరువాత స్థానాల్లో తెలంగాణ 6.15 స్కోర్ లో మూడో స్థానంలో నిలిచారు. ఆ తరువాత కేరళ 6.09 స్కోర్ తో 4 స్థానంలో, తమిళనాడు 5.92 స్కోర్లతో 5 వ స్థానంలో నిలిచాయి.

ఈ ర్యాంకింగ్ రాష్ట్రాల పోలీసింగ్ విధానాలు, న్యాయ సహకారం, సామాజిక, చట్టపరమైన పాలన అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించబడింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల నిర్వహణలో గణనీయమైన పురోగతులు సాధించాయని ఈ నివేదిక పేర్కొంది.

ఇందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ తాజా కూటమి ప్రభుత్వం పాలనలో రాష్ట్రంలో చట్టబద్ధత, ప్రజా భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి మంచి పనితీరు కనబరిచినట్లు పేర్కొంది. తెలంగాణ, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలూ న్యాయ వ్యవస్థను మెరుగుపరచడంలో అగ్రస్థానాల్లో ఉన్నాయి. ఈ రిపోర్ట్ ఆధారంగా వచ్చే రోజుల్లో ఇతర రాష్ట్రాలు కూడా ఈ రాష్ట్రాల విజయాలను కోల్పోకుండా బలోపేతం చేసుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు
Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?