
Srushti Fertility Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ కేసు (Srushti Fertility Case)లో మరో బిస్ట్ ట్వీస్ వెలుగులోకి వచ్చింది. సరోగసి పేరులో నవజాత శిశువుల అమ్మకాల జరిగిన సృష్టి ఫెర్టిలిటీ కేసు (Srushti Fertility Case).ఈ కేసులో అరెస్టయిన ముగ్గురు వైద్యులలో ఒకరు, వైసీపీ కీలక నేత సోదరుడు అని సమాచారం.
విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH) అనస్థీషియాలజీ విభాగాధిపతి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ వాసుపల్లి రవికుమార్ ఈ కేసులో ప్రధాన నిందితుడుల్లో ఒకరు గా గుర్తించారు. ఆయన, వైసీపీ లీడర్ వాసుపల్లి గణేష్‌కుమార్ కు సోదరుడు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రాధామిక సమాచారం ప్రకారం, వైసీపీ పాలనలో డాక్టర్ రవికుమార్ బదిలీ అయ్యారు. కానీ, కొద్ది రోజుల్లోనే డిప్యూటేషన్‌పై తిరిగి KGHలో చేరారు. ఈ వ్యవహారం అప్పట్లో కూడా వివాదాస్పదమైంది.
డబ్బు లావాదేవీలపై అనుమానం
హైదరాబాద్ పోలీసులు దర్యాప్తులో ఈ కేసు ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత, డాక్టర్ రవికుమార్ లకు పాత పరిచయం ఉంది. ఈ ఘటనలో డాక్టర్ నమత్ర భారీ మొత్తంలో డబ్బులు రవికుమార్‌కు ముట్టజెప్పినట్టు అనుమానిస్తున్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, డాక్టర్ నమ్రత, డాక్టర్ రవికుమార్ ఇద్దరూ 1988లో ఒకే బ్యాచ్‌లో ఎంబీబీఎస్ చదివారు.
ఏజెన్సీ ప్రాంతాలపై ఫోకస్
పోలీసుల దర్యాప్తు ప్రకారం.. శిశువుల అక్రమ విక్రయాలలో 80% పిల్లలు అరకూ, పాడేరు, ఒడిశా ఏజెన్సీ ప్రాంతాల నుంచే తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. అక్కడి నిరుపేద గర్భిణులను గుర్తించి, ముందుగానే ఒప్పందాలు చేసుకుని శిశువులను విక్రయించినట్లు బయటపడింది. ప్రస్తుతం పోలీసులు, ఏజెన్సీ ప్రాంతాల్లో శిశువులను విక్రయించిన వ్యక్తులు ఎవరు? అనే అంశంపై ఆరా తీస్తున్నారు. ఈ లావాదేవీల వెనుక మరింత పెద్ద నెట్‌వర్క్ ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.