AP Election Results : ఐపీఎల్ 2014 లో గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలోని కేకేఆర్ రెండో సారి టైటిల్ ను సాధించి ఛాంపియన్ గా నిలిచింది. అదే ఏడాది ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఈ క్రమంలోనే ఒక సెంటిమెంట్ థియరీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
Andhra Pradesh Election Results : ప్రజలు ఒక్కోసారి జరుగుతున్న సంఘటనల క్రమంలో కొన్ని విషయాలు చాలా బలంగా నమ్ముతుంటారు. ఒక ఘటనతో సంబంధం లేకుండా మరో ఘటన మళ్లీ జరగడం కూడా ఒక్కోసారి చూడవచ్చు. ఈ నేపథ్యంలోనే ఒక సెంటిమెంట్ థియరీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అదే ఇండియన్ ప్రీమియర్ లీగ్ తో ముడిపడిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల అంశం. కాస్తా విచిత్రంగా అనిపించినా ఈ విషయం తెలిస్తే ఔరా ఇది జరుగుతుందా?.. జరుగుతుందేమో? అనే ప్రశ్నలు మీకు తప్పకుండా వస్తాయి.
విషయంలోకి వెళ్తే.. 2014 ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఛాంపియన్ గా నిలిచింది. గౌతమ్ గంభీర్ నాయకత్వంలోని కేకేఆర్ ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను చిత్తుచేసి రెండో ఐపీఎల్ టైటిల్ ను సాధించింది. అదే ఏడాది ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగాయి. ఏపీ 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సెంటిమెంట్ థియరీ ప్రకారం 2024 లో ఇదే రిపీట్ అవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. టీడీపీ కూటమి శ్రేణులు ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.
undefined
టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్.. !
ఎందుకంటే, ఈ సెంటిమెంట్ థియరీ ప్రకారం 2014లో కేకేఆర్ ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోగా, యాదృచ్ఛికంగా బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ కూడా అదే ఏడాది ఏపీ ఎన్నికల్లో విజయం సాధించింది. 2014 ఎన్నికల ఫలితాల్లో తెలుగేదేశం పార్టీ 102 సీట్లు గెలుచుకుంది. వైఎస్ఆర్సీపీ 67 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ 4, ఎన్పీటీ 1, ఐఎన్డీ 1 స్థానాల్లో విజయం సాధించాయి.
కాగా, 2024లో ఇప్పటికే పూర్తయిన ఐపీఎల్ 2024 లో కేకేఆర్ ఛాంపియన్ గా నిలిచింది. కాబట్టి 2014 మాదరిగానే మరోసారి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధిస్తుందనే నమ్మకాలు ట్రెండ్ అవుతున్నాయి. టీడీపీ శ్రేణులు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. నమ్మకాలు ఏలా ఉన్నా.. ఒక్కోసారి సంబంధం లేకుండా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. కాబట్టి 2014 లో జరిగిన ఈ రెండు సంఘటనల్లో ఒకటి ఐపీఎల్ ట్రోఫీని కేకేఆర్ గెలవడం 2024 లో కూడా జరిగింది.. రెండో విషయం గమనిస్తే.. ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ విజయం సాధిస్తుందో.. లేదో తెలియలంటే ఫలితాలు వెలువడే వరకు వేచిచూడాల్సిందే.. !
అంబటి రాయుడు నువ్వు ఒక 'జోకర్'.. కెవిన్ పీటర్సన్ ఇలా అన్నాడేంటి భయ్యా..