''మేం పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా..'.'

By Arun Kumar P  |  First Published May 28, 2024, 2:03 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు మాత్రమే ముగిసాయి... ఫలితాలు ఇంకా వెలువడలేదు. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం పవన్ కల్యాణ్ ను పిఠాపురం ఎమ్మెల్యేను చేసేసారు.... అది ఎలాగంటే...


పిఠాపురం : పవన్ కల్యాణ్... మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగానే సినిమాల్లోకి, రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఇప్పుడు ఈ రెండింటిలోనూ అన్నను మించిన తమ్ముడు అనిపించుకుంటున్నారు. సినీ హీరోగా పవన్ క్రేజ్ మామూలుగా లేదు... అతడంటే అభిమానులు పడిచస్తుంటారు. ఇప్పుడు రాజకీయాల్లోనూ అదే స్థాయిలో పవన్ ను అభిమానిస్తున్నారు ప్రజలు. ముఖ్యంగా యువత పవన్ పై అభిమానాన్ని ఎప్పటికప్పుడు సరికొత్తగా వ్యక్తం చేస్తుంటారు. అయితే  ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు ముందే జనసేనానిని పిఠాపురం ఎమ్మెల్యేగా పేర్కొంటూ ఫ్యాన్స్ చేస్తున్న హడావిడి మామూలుగా లేదు. పవన్ ఫ్యాన్స్ అభిమానంతో చేస్తున్న పనులు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. 

ఆంధ్ర ప్రదేశ్ లో పార్లమెంట్ తో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటినుంటి పోలింగ్ ముగిసే పవన్ కల్యాణ్ ఏపీలోనే వున్నారు. ఓవైపు తాను పోటీచేస్తున్న పిఠాపురంను చూసుకుంటూనే రాష్ట్రవ్యాప్తంగా టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేపట్టారు పవన్. ఆయనతో పాటు మెగా కుటుంబ హీరోలు, సినీ నటులు, అభిమానులు, జనసైనికులు, కూటమి పార్టీల నాయకులు పిఠాపురంలో జోరుగా ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలు కూడా పవన్ కల్యాణ్ కు మద్దతుగా నిలిచారని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాలకు ముందే పవన్ ను పిఠాపురం ఎమ్మెల్యేగా పేర్కొంటూ సందడి చేస్తున్నారు ఫ్యాన్స్. 
 
కొందరు ఫ్యాన్స్ అయితే ఓ అడుగు ముందుకేసి తమ వాహనాలపై 'పిఠాపురం ఎమ్మెల్యే  గారి తాలూకా' అంటు స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. ఇలాంటి వాహనాలు ఆంధ్ర ప్రదేశ్ లో మరీముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంతకాలం పవన్ కల్యాణ్ ఫోటోలు, జనసేన జెండాలు, గాజు గ్లాస్ స్టిక్కర్లు ఎక్కువగా మెగా ఫ్యాన్స్, జన సైనికులు వాహనాలపై కనిపించేవి. పోలింగ్ తర్వాత 'పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా' స్టిక్కర్లతో కూడిన వాహనాలు కనిపిస్తున్నాయి. ఇలా అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అనిపించుకుంటున్నారు.

MLA Gari Thaluka || pic.twitter.com/KphIuY1Ml3

— 🦅GHANI'🐆👑 (@Bheemlaboy22)

Latest Videos


 

click me!