అక్రమసంబంధం... భర్త హత్య, భార్య ఆత్మహత్య, ప్రియుడు జైలుకు...

Arun Kumar P   | Asianet News
Published : Feb 25, 2021, 12:07 PM IST
అక్రమసంబంధం... భర్త హత్య, భార్య ఆత్మహత్య, ప్రియుడు జైలుకు...

సారాంశం

వివాహేతర  సంబంధం కారణంగా రెండు కుటుంబాలు రోడ్డునపడిన ఘటన పిఠాపురంలో చోటుచేసుకుంది.   

పిఠాపురం: వివాహేతర సంబంధం బార్యాభర్తల మరణానికి కారణమవడంతో పాటు మరోవ్యక్తిని జైలుపాలు చేసింది. తన శారీరక సుఖం కోసం కట్టుకున్నవాడిని హతమార్చిన మహిళ ప్రియుడి బెదిరింపులతో ఆత్మహత్య చేసుకుంది. భార్యాపిల్లలు వుండగా మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుని చివరకు హత్య కేసులో జైలుపాలయ్యాడు. ఇలా వివాహేతర  సంబంధం కారణంగా రెండు కుటుంబాలు రోడ్డునపడిన ఘటన పిఠాపురంలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం కోటవారి వీధిలో రెడ్డెం శ్రీనివాస్-స్వూపారాణి దంపతులు ముగ్గురు పిల్లలతో కలిసి నివాసముండేవారు. అయితే అదే వీధిలో ఓ ఇంటి నిర్మాణపనుల కోసం వచ్చిన రెడ్డి వీరబాబు అనే  వ్యక్తి తో స్వరూపరాణికి పరిచయం ఏర్పడి అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే వీరి సంబంధం విషయం శ్రీనివాస్ కు తెలియడంతో భార్యతో పాటు ఆమె ప్రియుడు వీరబాబును గట్టిగా హెచ్చరించాడు. 

దీంతో తమ అక్రమసంబంధానికి అడ్డు వస్తున్న భర్త అడ్డు తొలగించుకోవాలనుకున్న భార్య ప్రియుడితో కలిసి మర్డర్ ప్లాన్ చేసింది.  భర్త ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ప్రియుడిని పిలుచుకుని ఇద్దరూ  కలిసి శ్రీనివాస్ చంపేశారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా తాను లేచి చూసేసరికి భర్త రక్తపు మడుగులో ఉన్నాడని భార్య స్వరూపారాణి కట్టుకథ అల్లి అందరినీ నమ్మించింది.

అయితే పోలీసుల దర్యాప్తులో ఎక్కడ దొరికిపోతామోనని భయపడిన వీరబాబు ప్రియురాలు స్వరూపరాణికి బెదిరించాడు. తన పేరు బయటకు వస్తే నీ పేరు కూడా బయటపెడతానని బెదిరించడంతో స్వరూపరాణి కూడా భయపడింది. దీంతో ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందింది. ఇలా తల్లిదండ్రుల మరణంతో ముగ్గురు చిన్నారులు అనాధలయ్యారు. నిందితుడు వీరబాబుపై హత్య కేసుతో పాటు, ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసును నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.  

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?