టీడీపీ ఓడిపోతే గుండు చేయించుకుంటా...

Published : Aug 21, 2017, 11:37 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
టీడీపీ ఓడిపోతే గుండు చేయించుకుంటా...

సారాంశం

నంద్యాల్లో టీడీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసిన బోండా ఉమ. ఒకవేళ ఓడిపోతే గుండు చేసుకుంటాను, వైసీపి పార్టీ ఓడిపోతే మీరు సిద్దమా... అని సవాల్.

నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైతే గుండు గీయించుకుంటానని ఆ పార్టీ నేత బోండా ఉమ స‌వాల్ విసిరారు. విజయవాడలో సోమవారం బోండా మాట్లాడుతూ, ఉపఎన్నికల్లో టీడీపీదే విజయమని జోస్యం చెప్పారు. టీడీపీ చేసిన సంక్షేమ కార్యక్రమాలే పార్టీని నంద్యాల్లో విజయం దిశ‌గా నడిపిస్తాయని ఆయన చెప్పారు. 


నంద్యాలలో ఓటమిపాలైతే గుండు కొట్టించుకోవడానికి తాను సిద్ధమని, వైఎస్సార్సీపీ ఓటమిపాలైతే గుండు గీయించుకునేందుకు మీరు సిద్ధమా...?  అని వైసీపి నేత‌ల‌కు బోండా సవాల్ విసిరారు. ఆంధ్ర ప్ర‌జ‌లు టీడీపీ ప్ర‌భుత్వం చేస్తున్న అభివృద్ద‌కి ప‌ట్టం క‌ట్ట‌డానికి సిద్దంగా ఉన్నార‌ని, వైసీపి నాయ‌కులు నంద్యాల‌ ప్ర‌జ‌ల‌ను ఎన్ని ర‌కాలుగా మ‌భ్య పెట్టిన లాభం లేద‌ని ఆయ‌న పెర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Sajjala Ramakrishna Reddy Sensational Comments On Localbody Elections 2026 | Asianet News Telugu
విద్యార్థుల‌కు ఏపీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. త‌ల్లికి వంద‌నం రెండో విడ‌త నిధుల‌పై కీల‌క అప్‌డేట్