కాపు ఉద్యమకారులతో కిర్లంపూడి కిటకిట

First Published Aug 21, 2017, 10:50 AM IST
Highlights
  • ’చలో కిర్లంపూడి’ పిలుపుతో జనసంద్రమయిన కిర్లంపూడి
  • వేలాదిగా తరలి వస్తున్న కాపులు
  • మరొక  పెద్ద ఉద్యమానికి  సిద్దం కావాలంటున్న ముద్రగడ

తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ నివాసం ‘చలో కిర్లంపూడి’ సందర్శకులతో కిటకిటలాడింది. కిర్లంపూడి మెల్లిమెల్లిగా జనసంద్రమవుతూ ఉంది. ముద్ర గడ ‘చలో అమరావతి’ లో చేపట్టేందుకు రాష్ట ప్రభుత్వం అనుమతించడం లేదు. ఈ యాత్ర మొదలయితే, వేల సంఖ్యలో కాపులు రాష్ట్ర నలుమూలల నుండి వచ్చి ముద్రగడతో కలసి పాదయాత్ర చేయాలనుకున్నారు. అయితే, పోలీసుల నిర్భంధం కారణంగా ఇది నెరవేకపోవడంతో తమ నాయకుడిని  కలుసునేందుకు కొత్త వ్యూహం రచించారు. అదే  ‘చలో కిర్లంపూడి‘ పిలుపు.

ఈ పిలుపుతో వివిధ జిల్లాల నుండి పెద్దసంఖ్యలో కాపులు తరలివస్తున్నారు. ముద్రగడ పాదయాత్రకు అనుమతి వచ్చే వరకు రోజుకు రెండేసి నియోజకవర్గాల నుండి కాపుయువత తరలిరావాలని కాపు జెఎసి పిలుపునకు విపరీంతా స్పందన వస్తున్నది. ఒక వ్యవూం ప్రకారం, ఒకేరోజున కాకుండా వేర్వేరు తేదీలలో కిర్లంపూడికి వివిధ ప్రాంతాల  నాయకులు, అభిమానులు,కాపు పెద్దలు  వచ్చేలాచూస్తున్నారు. గత మూడు రోజుల నుండి ఉభయగోదావరి జిల్లాల నుండి కాపు నాయకులు కిర్లంపూడి వచ్చారు. వారితో  ముద్రగడ మంతనాలాడారు.‘కాపుల ఉద్యమసెగకు ప్రభుత్వం దిగ రాక తప్పదు.  ఇందుకు అందరూ రెండు నెలలు కష్టపడితేచాలు, ’ అని ముద్రగడ కాపులకు చెబుతున్నారు.

మరొక విశేషమేమిటంటే మహిళలు ఉద్యమానికి బాసటగా ఉండాలని, వారు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిస్తున్నారు. దీనికి కూడా స్పందన వస్తున్నది. చలో కిర్లంపూడికి పెద్ద సంఖ్యలోమహిళలు కూడా వస్తూ ఉండటం ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం నాడు జిల్లాలోని పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం, నిడదవోలు నియోజకవర్గాలతోపాటు నెల్లూరు, విశాఖ జిల్లాల నుండి భారీ సంఖ్యలో కాపు నాయకులు వచ్చి ముద్రగడకు సంఘీభావం తెలిపారు.

 కిర్లంపూడి సమీపంలో ని సింహాద్రిపురం కాపులు ఎడ్లబండ్లపై ముద్రగడకు మద్దతుగా నినాదాలు చేసుకుంటూ తరలివచ్చారు. రాజుపాలెం గ్రామానికి చెందిన మహిళలు, ధర్మవరం గ్రామానికి చెందిన సుమారు 400 మంది కాపుయువత ముద్రగడ శిబిరంలో పాల్గొన్నారు.రాష్ట్రంలో కాపుల సంఖ్యను కూడా కుదించి 30, 40 లక్షల కంటే ఎక్కువమంది లేరని, ముఖ్యమంత్రి సామాజిక వర్గం వారు అంటే కమ్మలు ఎక్కువగా ఉన్నట్టు చూపించే కుట్ర జరుగుతూ ఉందని ఆయన చెప్పారు.

‘చంద్రబాబు అధికారం చేపట్టి మూడు సంవత్సరాలు కావస్తోందని అయినా రిజర్వేషన్ల ఊసులేదు.  మంజునాథ్ కమిషన్ నివేదిక ఏడు నెలల్లో తెప్పించుకుని కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని గత ఏడాది ఫిబ్రవరిలో మంత్రులు హామీ ఇచ్చారు. ఇపుడు  సంవత్సరం పూర్తయింది. ఇది ఏమని అడిగితే పోలీసుల  నిర్బంధం వస్తున్నది,’ అని అన్నారు.

click me!