ప్రాణహాని అంటున్న కమేడియన్ వేణుమాధవ్

Published : Aug 21, 2017, 11:26 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
ప్రాణహాని అంటున్న కమేడియన్ వేణుమాధవ్

సారాంశం

పోలీసులకు ఫిర్యాదు చేసిన వేణుమాధవ్

 

వైసీపీ నాయకుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ హాస్య నటుడు వేణు మాధవ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన గత కొద్ది రోజులుగా నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున ప్రచారం చేస్తున్నారు. మొదట్లో మామాలుగానే ప్రచారం చేస్తూ వచ్చిన వేణుమాధవ్ కు మధ్య లో పూనకం రావడం మొదలయింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల కిందట ప్రచారానికి వచ్చినప్పుడు  ఆయన వొళ్లు మర్చిపోయాడు. సినిమా యాక్టర్లు ప్రచారం చేస్తున్నట్లు కాకుండా అచ్చు రాజకీయ నాయకుడిలాగా మాట్లాడుతూ జగన్ బట్టే బాజ్ అని, దొంగ అని రకరకాలు దూషించాడు, ముఖ్యమంత్రి మెప్పుకోసం.  అయితే, ఇపుడు ఆయన జగన్ పార్టీ నుంచి తనకు ప్రాణహాని ఉందంటున్నాడు.

జగన్ మీద చేసిన వ్యాఖ్యలకు వేణుమాధవ్ కు విమర్శలొచ్చాయి.  పోన్ చేసి తమ వ్యతిరేకత తెలిపారు,. దీనిని ప్రస్తావిస్తూ కొంతమంది వైసీపీ నాయకులు తనకు పోన్ చేసి బెదిరించినట్లు ణుమాధవ్‌కు ఫిర్యాదు చేశాడు.

 

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి 

ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్

 

PREV
click me!

Recommended Stories

Sajjala Ramakrishna Reddy Sensational Comments On Localbody Elections 2026 | Asianet News Telugu
విద్యార్థుల‌కు ఏపీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. త‌ల్లికి వంద‌నం రెండో విడ‌త నిధుల‌పై కీల‌క అప్‌డేట్