ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో ఐఎస్ ఆఫీసర్ అమ్రపాలి భేటీ...

Published : Jan 04, 2022, 12:14 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో ఐఎస్ ఆఫీసర్ అమ్రపాలి భేటీ...

సారాంశం

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి YS Jaganతో ప్రధాన మంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న kata amrapali.. ఆయన నివాసంలో కలుసుకుని చర్చలు జరిపారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన ఆమ్రపాలి.. ఆంధ్రా కేడర్ నుంచి తెలంగాణ కేడర్ కు మారిన విషయం తెలిసిందే.  

న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి YS Jaganతో ప్రధాన మంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న kata amrapali.. ఆయన నివాసంలో కలుసుకుని చర్చలు జరిపారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన ఆమ్రపాలి.. ఆంధ్రా కేడర్ నుంచి తెలంగాణ కేడర్ కు మారిన విషయం తెలిసిందే.

ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గత ఏడాది పీఎంఓలో amrapaliని కలుసుకుని,  ఆమెతో ఫోటో దిగడంతో పాటు ఆమె ఆంధ్రప్రదేశ్ కు గర్వకారణం అని ట్వీట్ చేశారు.  ఆంధ్రప్రదేశ్ కు చెందిన కీలక విషయాల గురించి తెలుసుకునేందుకు ప్రవీణ్ ప్రకాష్ ఆమె సహకారం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నేపథ్యంలో Amrapali నేరుగా జగన్ తో భేటీ కావడం విశేషం.

నిజానికి తన కార్యాలయంలో అధికారులు ఇలా బయటకు వచ్చి ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ నేతలు, జర్నలిస్టులను కలుసుకోవడం ప్రధానమంత్రి ఇష్టపడరని ఒక అధికారి తెలిపారు. కాగా జగన్ ఇవాళ కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. సోమవారం నాడు ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో వేర్వేరుగా భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో భేటీ అయ్యారు.

ఆ ఎమ్మెల్యేల సీట్ల పంచాయితీపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ... వైసిపి శ్రేణులకు స్ట్రాంగ్ వార్నింగ్

ఇదిలా ఉండగా, ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను అమలు చేస్తే  తమ రాష్ట్రానికి చాలా వరకు ఊరట లభిస్తుందని సోమవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధాని Narnedra Modiకి చెప్పారు. ఏపీ సీఎం Ys Jagan  ప్రధాని నరేంద్ర మోడీతో  సోమవారం నాడు భేటీ అయ్యారు. సుమారు గంటలకు పైగా ఈ బేటీ కొనసాగింది. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకొచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్.

రాష్ట్ర విభజన పర్యవసానాలు, ఆర్ధిక ప్రగతిని తీవ్రంగా దెబ్బతీశాయని సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోడీ దృష్టికి తీసుకొచ్చారు.రాష్ట్ర విభజన సమయంంలో 58 శాతం జనాభా  Andhra pradesh కి వచ్చిందన్నారు.  45 శాతం రెవిన్యూ మాత్రమే ఏపీకి దక్కిందని ఆయన గుర్తు చేశారు.

భౌగోళికంగాTelangana కంటే ఏపీ పెద్దదనే విషయాన్ని సీఎం జగన్ ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు. విభజనతో ఏపీ రాజధానిని కూడా కోల్పోయిందని సీఎం మోడీకి చెప్పారు. Special Status తో పాటు అనేక హమీలను నెరవేర్చలేదన్నారు. వీటిని అమలు చేస్తే చాలా వరకు ఊరట లభిస్తుందని జగన్ అభిప్రాయపడ్డారు.

2017-18 ధరల ప్రకారంగా పోలవరం  అంచనా వ్యయాన్ని రూ. 55, 657 కోట్లుగా నిర్ణయించాలని సీఎం జగన్ ప్రధానిని కోరారు. కేంద్రం నుండి పోలవరం ప్రాజెక్టుకు పెండింగ్ బిల్లులు రూ. 2100 కోట్లు  మంజూరు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రధానిని కోరారు.తెలంగాణ విద్యుత్ సంస్థల నుండి ఏపీ రావాల్సిన 6,284 కోట్లను చెల్లించేలా చూడాలని కూడా ఆయన ప్రధానికి విన్న వించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Constable Success Stories:వీళ్ళ ఎమోషనల్ మాటలు చూస్తే కన్నీళ్లు ఆగవు | Police | Asianet News Telugu
Bhumana Karunakar Reddy: దేవుడ్ని దోచి, ఒబెరాయ్ కు కట్టబెడుతున్న బాబు ప్రభుత్వం| Asianet News Telugu