రాజకీయాల్లో సమూల మార్పులకు ప్రయత్నిద్దాం: దళిత, బీసీ, కాపులకు ముద్రగడ లేఖ

By narsimha lode  |  First Published Jan 4, 2022, 10:10 AM IST

దళిత, బీసీ, కాపులకు  ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. రాజకీయాల్లో సమూల మార్పులకు ప్రయత్నాలు చేద్దామని ఆయన ఆ లేఖలో కోరారు. తక్కువ జనాభా ఉన్న వారి పల్లకి ఎంతకాలం మోయాలా అని ఆయన ప్రశ్నించారు. 
 


కాకినాడ: రాజకీయాల్లో సమూల మార్పు కోసం ప్రయత్నం చేద్దామని  కాపులు, బీసీలు, దళితులకు కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కోరారు.  ఈ మేరకు మంగళవారం నాడు ఈ వర్గాలకు బహిరంగ లేఖ రాశాడు.దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, కానీ మన వర్గాలకు రాలేదన్నారు. తక్కువ జనాభా ఉన్నవారికి మనం పల్లకిలు మోయాలా అని Mudragada Padmanabham ప్రశ్నించారు.ఈ రాష్ట్రం ఎవరి ఏస్టేట్ కాదు, జాగీరు అంతకన్నా కాదని ఆయన తేల్చి చెప్పారు. హడావుడి ఆర్భాటాలు లేకుండా రాజ్యాధికారం కోసం ప్రయత్నాలు చేద్దామని ఆయన ఆ లేఖలో కోరారు. దళిత, బీసీ, కాపు వర్గాల పెద్దలు మంచి నిర్ణయం తీసుకోవాలన్నారు.

మన అవసరం తీరాక పశువుల కన్నా హీనంగా చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, బీసీలు, కాపుల సహకారంతో రాజకీయాధికారం కోసం బ్లూ ప్రింట్ తయారు చేద్దామని ఆయన ఆ లేఖలో కోరారు.

Latest Videos

also read:ఏపీలో మారుతున్న కాపు రాజకీయం: పార్టీలకతీతంగా ఒక్కటవుతున్న నేతలు, శాసించేది తామేనన్న గంటా

Andhra pradesh రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు విషయమై Kapu సామాజిక వర్గానికి చెందిన నేతలు ఇటీవల సమావేశమయ్యారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు గత ఏడాది డిసెంబర్ మాసంలో Hyderabad వేదికగా సమావేశమయ్యారు. అదే సమయంలో Dalita, B.c  నేతలు కూడా ముద్రగడ పద్మనాభంతో సమావేశమయ్యారు.  రాష్ట్రంలో కాపులకు రాజకీయ అధికారం విషయమై చర్చించారు.ఈ సమావేశాల తర్వాత ముద్రగడ పద్మనాభం ఈ లేఖ రాయడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.

కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు వరుసగా సమావేశమైన సమయంలో రాష్ట్రంలో పార్టీల పరిస్థితిపై కూడా చర్చించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు పార్టీలు ఏర్పాటు చేసి రాజకీయంగా విఫలమయ్యారనే చర్చ కూడా  ఈ సమావేశాల్లో కొందరు కాపు నేతలు అభిప్రాయపడినట్టుగా సమాచారం.  కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు సమావేశం కావడాన్ని ఏపీలోని ప్రధాన పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.  అధికారంలో ఉన్న వైసీపీ, విపక్ష టీడీపీలు ఈ సమావేశాలపై ఆరా తీస్తున్నాయి. అయితే కాపు సామాజిక వర్గం నేతలు సమావేశం కావడంపై టీడీపీ సమాచార సేకరణలో ఉందని తెలుస్తోంది. ఈ సమావేశాల వెనుక ఎవరున్నారనే విషయమై ఆ పార్టీ నాయకత్వం కేంద్రీకరించిందని సమాచారం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు సుమారు 12 శాతం ఉంటారు.  రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాపు సామాజిక ఓటర్లు ప్రధాన పాత్ర పోషిస్తారు.ఈ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే  కాపులు రాజకీయాధికారాన్ని దక్కించుకోవడం కోసం సమావేశాలు నిర్వహించడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు భవిష్యత్తులో కూడా ప్రత్యామ్నాయ వేదిక గురించి సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే కులం  వేదికగా పార్టీ ఏర్పాటు చేస్తే ఆ పార్టీకి రాజకీయంగా మనుగడ ఉంటుందా అనే చర్చ కూడా లేకపోలేదు. ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలకు అన్ని సామాజిక వర్గాల అండ లభించడం కూడా కలిసి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒక  సామాజిక వర్గానికే ప్రాతినిథ్యం వహించేలా ఉండకుండా ఉండేందకు గాను బీసీ, దళితులను కూడా కలుపుకు పోవాలని కాపు సామాజిక వర్గం నేతలు భావిస్తున్నారని సమాచారం.


 


 

click me!