ప్రబోధానంద స్వామి వీడియోలు బయటపెడతా: జేసీ

By narsimha lodeFirst Published Sep 18, 2018, 2:32 PM IST
Highlights

ప్రబోధానంద స్వామిజీ విషయంలో తాను ఓడిపోయానో... గెలిచానో తేల్చాల్సింది మీడియానేనని  అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. 

అమరావతి: ప్రబోధానంద స్వామిజీ విషయంలో తాను ఓడిపోయానో... గెలిచానో తేల్చాల్సింది మీడియానేనని  అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. స్వామిజీకి చెందిన  వీడియోలను బయటపెడతానని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

ప్రబోధానంద స్వామి శిష్యులకు  చిన్నపొలమడ గ్రామస్తులకు  రెండు రోజుల క్రితం గొడవ జరిగింది. పరస్పరం దాడులు చేసుకొన్నారు. ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై  గ్రామస్తులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రెండు రోజులపాటు ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే.

మంగళవారం నాడు  అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అమరావతికి చేరుకొన్నారు.  ఏపీ సీఎంను అసెంబ్లీలో జేసీ దివాకర్ రెడ్డి కలుసుకొన్నారు. ప్రబోధానందస్వామి ఘటనపై బాబుకు జేసీ  వివరణ ఇచ్చారు. 

త్వరలోనే ప్రబోధానంద స్వామిజీకి చెందిన  వీడియోలను రిలీజ్ చేస్తానని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి  చెప్పారు.స్వామిజీకి తాను సాష్టాంగపడ్డానని కొందరు చేసిన ఆరోపణలను  కూడ ఆయన కొట్టిపారేశారు. స్వామిజీతో పెట్టుకొంటే  నియోజకవర్గంలో ఇబ్బందులుంటాయని కామెంట్లు చేసే వారిలో గెలిచే వారెవ్వరూ లేరని జేసీ తెలిపారు. 

కుల,మతాలకు అతీతగా ప్రబోధానందస్వామి బాధితులు ఉన్నారని  జేసీ  చెప్పారు. స్వామిజీ విషయంలో  తాను ఓడిపోయానో... ఓడానో తేల్చాల్సింది మీడియా అనే జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. 

ఈ వార్తలు చదవండి

చల్లబడిన జేసీ దివాకర్ రెడ్డి: అధికారులు ఏం చేశారంటే?

జేసీ దివాకర్ రెడ్డికి బాబు ఫోన్: న్యాయ విచారణ చేయిస్తామని హామీ

ఆశ్రమంపై చర్యలు తీసుకోండి.. రాత్రంతా పోలీస్ స్టేషన్ ముందే కూర్చొన్న జేసీ

చిన్నపొడమలలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్ ముందు జేసీ ధర్నా

గణేష్ నిమజ్జనంతో చిన్నపొడమలలో ఉద్రిక్తత: జేసీ దివాకర్ రెడ్డి నిరసన

click me!