జగన్ పై అలక: రెండు రోజుల్లో భవిష్యత్తుపై వంగవీటి రాధా నిర్ణయం

By Arun Kumar PFirst Published Sep 18, 2018, 2:30 PM IST
Highlights

విజయవాడ వైసీపిలో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. వంగవీటి రాధాను కాదని విజయవాడ సెంట్రల్ సీటు మల్లాది విష్ణుకు ఖరారైనట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో నిన్నటినుండి రాధా,రంగా అభిమానులు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మల్లాది విష్ణును విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది వైసిపి పార్టీ. దీంతో రాధా వర్గీయుల్లో ఆగ్రహం కట్టలుతెంచుకుంది. దీంతో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకోడానికి రాధారంగ మిత్రమండలి వంగవీటి రాధా తో సమావేశమయ్యింది. 

కొద్దిసేపటి క్రితమే రాధారంగ మిత్రమండలి సమావేశం ముగిసింది. రాధా ఏ పార్టీలో ఉంటే తాము అదే పార్టీలో ఉంటామని రాధా అభిమానులు తెలిపారు. ఆగ్రహంతో ఊగిపోయిన రాధా అభిమానులు పార్టీ సభ్యత్వ ప్రతులను తగలబెట్టారు. దీంతో సంయమనంతో ఉండాలని రాధా అభిమానులు, కార్యకర్తలకు సూచించారు.  మూడు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని రాధా వెల్లడించారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి రాధా వైసిపి తరపున పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆ తర్వాత రాజకీయ కారణాలతో సెంట్రల్ నియోజకవర్గంపై దృష్టి సారించాల్సిందిగా పార్టీ నుండి రాధాకు ఆదేశాలు అందాయి. దీంతో అప్పటినుండి రాధా అక్కడ తన క్యాడర్ ను పెంచుకుటూ కార్యకర్తలతో కలిసి పార్టీ సమావేశాలను నిర్వహిస్తున్నారు.

అయితే ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. దీంతో విజయవాడ వైసిపిలో ముసలం మొదలైంది. నివురుగప్పిన నిప్పుల వున్న విబేధాలు తాజాగా సెంట్రల్ సీటు విషయంలో బైటపడ్డాయి. దీంతో వంగవీటి రాధా తన భవిష్యత్ కార్యాచరణను మరో మూడు రోజుల్లో ప్రకటించనున్నట్లు వెల్లడించారు. 
 
సంబంధిత వార్తలు

వైసీపీ సభ్యత్వ పుస్తకాలు దగ్ధం: అనుచరులతో వంగవీటి రాధా భేటీ

వంగవీటి రాధాకు ‌మరో షాక్: మల్లాది విష్ణు వైపే జగన్ మొగ్గు

వంగవీటి రాధా ఆగ్రహం: బుజ్జగింపులు, ఆ రోజు ఏం జరిగిందంటే...

click me!