
జమ్మలమడుగు: ఈ ఏడాది డిసెంబర్ 26వ తేదీన కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. మూడేళ్లలో ఫ్యాక్టరీ పనులు పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
సోమవారం నాడు జమ్మలమడుగులో రైతు దినోత్సవ కార్యక్రమంలో జగన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో డ్రామాలు ఆడారని ఆయన విమర్శలు చేశారు.
ఈ ఫ్యాక్టరీ ప్రారంభమైతే సుమారు 20వేల మందికి ఉపాధి దక్కే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులకు నీరందేలా చర్యలు తీసుకొంటామన్నారు. మరో వైపు జమ్మలమడుగులోని చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు
ఎమ్మెల్యేలే మార్కెట్ కమిటీ గౌరవ చైర్మెన్లు: జగన్
ఈసారి ఓటేయని వాళ్లు కూడ ఓటేసేలా పనులు: జగన్