అధికారులతో సంప్రదించిన తర్వాతే మందు పంపిణీ తేదీ ప్రకటిస్తా: ఆనందయ్య

Published : May 31, 2021, 09:08 PM IST
అధికారులతో సంప్రదించిన తర్వాతే మందు పంపిణీ తేదీ ప్రకటిస్తా: ఆనందయ్య

సారాంశం

అధికారులను సంప్రదించిన  తర్వాత మందు పంపిణీ తేదీని  ప్రకటిస్తానని ఆనందయ్య ప్రకటించారు.మందు పంపిణీకి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఆనందయ్య ఇంటి వద్ద సోమవారం నాడు స్థానికులు పెద్ద ఎత్తున చేరుకొన్నారు.  


నెల్లూరు: అధికారులను సంప్రదించిన  తర్వాత మందు పంపిణీ తేదీని  ప్రకటిస్తానని ఆనందయ్య ప్రకటించారు.మందు పంపిణీకి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఆనందయ్య ఇంటి వద్ద సోమవారం నాడు స్థానికులు పెద్ద ఎత్తున చేరుకొన్నారు.దాదాపుగా వారం రోజులుగా ఆనందయ్య మందు తయారీని నిలిపివేశాడు. అయితే  జాతీయ ఆయుర్వేద సంస్థ నిర్వహించిన  పరిశోధనలో ఆనందయ్య మందుతో ఎలాంటి ఇబ్బంది లేదని రిపోర్టు ఇచ్చింది. ఈ రిపోర్టు ఆధారంగా  ఏపీ ప్రభుత్వం ఈ మందుకు ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

also read:ఆనందయ్య మందు కరోనా తగ్గిస్తుందని చెప్పలేం: ఆయుష్ కమిషనర్ రాములు

ఈ విషయం తెలిసిన తర్వాత ఆనందయ్య ఇంటికి పెద్ద ఎత్తున స్థానికులు వచ్చారు. ఆనందయ్యతో మాట్లాడారు. ఆనందయ్య ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఇతర  ప్రాంతాల నుండి ఎవరూ కూడ రావొద్దని ఆయన చెప్పారు. మందు తయారీ కోసం కనీసం మూడు రోజుల  సమయం పట్టే అవకాశం ఉందన్నారు. వనమూలికల సేకరణ ప్రారంభించినట్టుగా ఆయన తెలిపారు.  మరో వైపు కంటిలో వేసే మందుకు కూడ అనుమతి ఇవ్వాలని ఆనందయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్