ఆనందయ్య తయారు చేస్తున్న మందుతో కరోనా తగ్గుతోందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఆయుష్ కమిషనర్ రాములు చెప్పారు. కరోనా నివారణ కోసం వాడుతున్నట్టుగా కాకుండా హెల్త్ సప్లిమెంట్ గా ఉపయోగించుకోవచ్చన్నారు.
అమరావతి:ఆనందయ్య తయారు చేస్తున్న మందుతో కరోనా తగ్గుతోందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఆయుష్ కమిషనర్ రాములు చెప్పారు. కరోనా నివారణ కోసం వాడుతున్నట్టుగా కాకుండా హెల్త్ సప్లిమెంట్ గా ఉపయోగించుకోవచ్చన్నారు.సోమవారం నాడు ఆయుష్ కమిషనర్ రాములు అమరావతిలో మీడియాతో మాట్లాడారు. కరోనాకు ఉపయోగించే ఇతర మందులతో పాటు ఆనందయ్య మందును కూడ వాడాలని ఆయన సూచించారు. కరోనాకు ఉపయోగించే మందులను పక్కన పెట్టి ఆనందయ్య మందే ఉపయోగించవద్దన్నారు.
also read:కంట్లో వేసే చుక్కల మందుపై ఆనందయ్య అభ్యర్థన: జగన్ ప్రభుత్వానికి హైకోర్టు ఆర్డర్
undefined
ఆనందయ్య మందును కేంద్ర పరిశోధన సంస్థతో కలిసి పరిశోధన చేసినట్టుగా చెప్పారు. కేంద్ర సంస్థ నివేదికతో ఆనందయ్య మందుకు ప్రభుత్వం అనుమతించినట్టుగా ఆయన చెప్పారు. ఈ మందుతో ఎలాంటి నష్టం జరుగుతుందని చెప్పడానికి ఎలాంటి ఆధారం లభించలేదన్నారు. ఈ నెల 21,22 తేదీల్లో తమ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి ఆనందయ్య తయారు చేసిన మందును పరిశీలించినట్టుగా ఆయన మరోసారి గుర్తు చేశారు.
ఆనందయ్య తయారు చేస్తున్న కె అనే రకం మందు శాంపిల్స్ తమకు అందలేదని ఆయన చెప్పారు. ఆనందయ్య తయారు చేస్తున్న పీ, ఎల్, ఎఫ్ అనే మందులను ఉపయోగించుకోవచ్చని ఆయన చెప్పారు. ఆనందయ్య మందుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని ఆయన తెలిపారు. ఆనందయ్య తయారు చేస్తున్న కంటి మందు కారణంగా నష్టం జరగదని తమకు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ఈ మందు పంపిణీ సమయంలో కోవిడ్ ప్రోటోకాల్స్ ను కచ్చితంగా పాటించాలని సీఎం కోరినట్టుగా చెప్పారు.