ఏపీలో తగ్గిన కరోనా కేసులు: కానీ తగ్గని మరణాలు

By narsimha lodeFirst Published May 31, 2021, 5:22 PM IST
Highlights

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  గత 24 గంటల్లో కొత్తగా 7,943కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 16లక్షల 93 వేల 085కి చేరుకొన్నాయి.కరోనాతో ఒక్క రోజులోనే 98 మంది మరణించారు. 
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  గత 24 గంటల్లో కొత్తగా 7,943కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 16లక్షల 93 వేల 085కి చేరుకొన్నాయి.కరోనాతో ఒక్క రోజులోనే 98 మంది మరణించారు. గత 24 గంటల్లో అనంతపురంలో 544 చిత్తూరులో 1283, తూర్పుగోదావరిలో3152, గుంటూరులో1677, కడపలో447, కృష్ణాలో291, కర్నూల్ లో499, నెల్లూరులో 378, ప్రకాశంలో 345,విశాఖపట్టణంలో 551, శ్రీకాకుళంలో 231, విజయనగరంలో271, పశ్చిమగోదావరిలో 461 కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో98  మంది మరణించారు. చిత్తూరులో 15 మంది, పశ్చిమగోదావరిలో 12 మంది, ప్రకాశంలో 10 మంది అనంతపురంలో 9 మంది, తూర్పుగోదావరిలో 8 మంది, విశాఖపట్టణంలో ఎనిమిది మంది, శ్రీకాకుళంలో ఏడుగురు కరోనాతో మరణించారు.కృష్ణా, కర్నూల్, విజయనగరం జిల్లాల్లో కరోనాతో ఆరుగురి చొప్పున కరోనాతో చనిపోయారు.నెల్లూరులో నలుగురు, కడపలో ముగ్గురు చనిపోయారు. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రంలో 10,930మంది చనిపోయారు. 

గత 24 గంటల్లో 83,461 మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 7943 మందికి కరోనా సోకినట్టుగా తేలింది. గత 24 గంటల్లో కరోనా నుండి 19,845  మంది కోలుకొన్నారు. ఇప్పటివరకు కరోనా నుండి 15,28,369 నుండి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు19,25,604 మంది నుండి శాంపిల్స్ సేకరించారు. ఇప్పటికి రాష్ట్రంలో 16,93,085 మందికి కరోనా సోకింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,53,795 యాక్టివ్ కేసులున్నాయి. 

ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,38,298 మరణాలు 911
చిత్తూరు-1,91,089మరణాలు1296
తూర్పుగోదావరి-2,25,590, మరణాలు 967
గుంటూరు -1,49, 895,మరణాలు 946
కడప -94,857 మరణాలు 549
కృష్ణా -88,622 ,మరణాలు 974
కర్నూల్ - 1,15,215, మరణాలు 818
నెల్లూరు -1,18,057,, మరణాలు 718
ప్రకాశం -1,07,106 మరణాలు 799
విశాఖపట్టణం -1,37,172, మరణాలు 938
విజయనగరం -74,333, మరణాలు 558
పశ్చిమగోదావరి-1,40,972, మరణాలు 868

 

: 31/05/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 16,90,190 పాజిటివ్ కేసు లకు గాను
*15,25,465 మంది డిశ్చార్జ్ కాగా
*10,930 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,53,795 pic.twitter.com/Vx3s8rHUgS

— ArogyaAndhra (@ArogyaAndhra)

 

click me!