K a paul : చంద్ర‌బాబు, జ‌గ‌న్, ప‌వ‌న్ కంటే నాకే ప్ర‌జ‌ల స‌పోర్ట్ ఎక్కువ - కేఏ పాల్

Published : Jul 31, 2022, 08:48 AM IST
K a paul : చంద్ర‌బాబు, జ‌గ‌న్, ప‌వ‌న్ కంటే నాకే ప్ర‌జ‌ల స‌పోర్ట్ ఎక్కువ - కేఏ పాల్

సారాంశం

తెలంగాణలో సీఎం కేసీఆర్ ను, కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దించాల్సిన అవసరం ఉందని ప్రజా శాంతి అధినేత కే ఏ పాల్ అన్నారు. తెలంగాణలో తనకు 30 లక్షలకు ఓటర్లు పెరిగారని చెప్పారు. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్ర‌జ‌ల త‌న‌కే ఎక్కువ‌గా మ‌ద్ద‌తు ఇస్తున్నార‌ని ప్ర‌జా శాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ తెలిపారు. టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కంటే ఎక్కువ మంది ప్ర‌జ‌లు న‌న్నే సీఎంగా ఉండాల‌ని ఆకాంక్షిస్తున్నార‌ని చెప్పారు. ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు అయిన జ‌గ‌న్, కేసీఆర్ ఇద్ద‌రూ క‌లిసి ప్ర‌యాణిస్తే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందేవ‌ని అన్నారు. కానీ వారిద్ద‌రూ చెరో దారిలో ప‌య‌నిస్తున్నార‌ని తెలిపారు. దానికి వారు ఒప్పుకోవ‌డం లేద‌ని అన్నారు.

Monkeypox: ఏపీలో మంకీపాక్స్ క‌ల‌క‌లం.. శాంపిల్స్ ను ఎన్ఐవీకి పంపిన అధికారులు !

తెలంగాణ రాష్ట్రంలోనూ త‌న‌కు మ‌ద్ద‌తు దారులు పెరిగార‌ని కేఏ పాల్ చెప్పారు. ‘‘ తెలంగాణ నాపై దాడి జరిగిన నాటి నుంచి ఇక్క‌డ పొలిటిక‌ల్ స్ట్ర‌క్చ‌ర్ మారిపోయింది. ఈ ఒక్క ఘ‌ట‌న‌తో నాటు దాదాపు 30 ల‌క్ష‌ల‌కు పైగా ఓట్లు పెరిగాయి ’’ అని పాల్ అన్నారు. భారత దేశానికి శ్రీలంక లాంటి ఆర్థిక సంక్షోభం ఎదుర‌వ్వ‌క ముందే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆ ప‌ద‌వి నుంచి దించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు.

చికోటి ‘చీకటి’ మిత్రుడెవరో.. కేటీఆర్ నోరుమెదపరేం, ఆ స్టిక్కర్ దొంగిలించింది ఎవరు : రేవంత్

ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ సీఎం కేసీఆర్ ను ఓడ‌గొట్టాల‌ని చెప్పారు. అవ‌స‌రం అయితే తెలంగాణ రాష్ట్రంలో  తాను పోటీ చేస్తాన‌ని ప్రక‌టించారు. ఏపీ సీఎం జ‌గ‌న్ కు తాను మ‌ద్ద‌తు ఇచ్చే ప్ర‌స‌క్తే లేద‌ని స్పష్టం చేశారు. ఆయ‌న‌కు బాగా పొగ‌రు ఎక్కువ అయ్యింద‌ని అన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్ర‌భుత్వం కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా, అలాగే ప్యాకేజ్ ఇవ్వ‌డం లేద‌ని చెప్పారు. అందుకే తాను పీఎం అవ్వాల‌ని అనుకుంటున్నాని అన్నారు. అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌కు మంచి జ‌రుగుతుంద‌ని తెలిపారు.

పెద్దపల్లి జిల్లా: నీటిపై తేలియాడే సోలార్ ప్లాంట్‌‌ను ప్రారంభించిన మోడీ

తాను తెలంగాణ సీఎంగా ఉంటాన‌ని కేఏ పాల్ అన్నారు. జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌తో క‌లిసి న‌డిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు సీఎంగా ఆయ‌న‌నే ఉంచుతాన‌ని ప్ర‌క‌టించారు. వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ మూడేళ్ల పాల‌న‌లో అభివృద్ధి జ‌ర‌గ‌లేద‌ని అన్నారు. కానీ అప్పులు మాత్రం అయ్యాయ‌ని ఆరోపించారు. రాష్ట్రంలో పేద వ‌ర్గాల‌కు మంచి జ‌ర‌గాలంటే, అధికారం రావాలంటే త‌మ పార్టీని గెలిపించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం