విశాఖ తీరంలో మళ్లీ రింగువలల వివాదం.. కొట్టుకున్న ఇరువర్గాలు, ఉద్రిక్తత

Siva Kodati |  
Published : Jul 30, 2022, 06:13 PM ISTUpdated : Jul 30, 2022, 06:18 PM IST
విశాఖ తీరంలో మళ్లీ రింగువలల వివాదం.. కొట్టుకున్న ఇరువర్గాలు, ఉద్రిక్తత

సారాంశం

విశాఖ జిల్లాలోని మత్స్యకార గ్రామాల్లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. మరోసారి రింగ్ వలల వివాదం మొదలైంది. జెంటిల్మెన్ ఒప్పందం జరిగి 24 గంటలు గడవక ముందే ఘర్షణ చెలరేగింది. రింగు వలలకు చెందిన కొన్ని బోట్లను తెచ్చేందుకు యత్నించారు సంప్రదాయ మత్స్యకారులు. దీంతో వారిని అడ్డుకున్నారు పోలీసులు.

విశాఖ జిల్లాలోని మత్స్యకార గ్రామాల్లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. మరోసారి రింగ్ వలల వివాదం మొదలైంది. జెంటిల్మెన్ ఒప్పందం జరిగి 24 గంటలు గడవక ముందే ఘర్షణ చెలరేగింది. రింగు వలలకు చెందిన కొన్ని బోట్లను తెచ్చేందుకు యత్నించారు సంప్రదాయ మత్స్యకారులు. దీంతో వారిని అడ్డుకున్నారు పోలీసులు. 

ఇది వివాదం: 

కాగా.. విశాఖ హార్బర్ నుంచి భీమిలి తీరం వరకు దాదాపు అన్ని మత్స్యకార గ్రామాల గంగపుత్రులు.. రింగు వలలతో చేపల వేట సాగిస్తున్నారు.  దీంతో సాంప్రదాయ మత్స్యకారులు రింగు వలలను నిషేధించాల్సిందిగా కొన్ని నెలలుగా నిరసనలు చేశారు. దీనిపై అధికారులతో చర్చలు జరిపినా.. ఫలితం లేకపోవడంతో కొందరు రింగు వలల మత్స్యకారులు హైకోర్టు మెట్లెక్కారు. 13 బోట్లకు మాత్రమే రింగు వలలతో సముద్ర తీరానికి అనుమతిచ్చిన కోర్టు.. ఎనిమిది కిలోమీటర్ల అవతల వేట చేయవచ్చని ఆదేశాలు జారీ చేసింది. అయితే.. రింగు వలల మత్స్యకారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, తీరానికి సమీపంలో వేట చేయటం వలన మత్స్య సంపద నాశనమైపోతోందని సాంప్రదాయ మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.

Also Read:రింగు వలల వివాదం.. మరోసారి భగ్గుమన్న విశాఖ, రోడ్డుపైకి వేలాది మంది మత్స్యకారులు

మరోవైపు.. రింగు వలలను వినియోగిస్తున్నారని అనుమానిస్తూ సముద్రంలో లంగరు వేసి ఉన్న ఆరు తెప్పలతో పాటు వలలకు పెద జాలారీపేట, కొత్త జాలారీపేటకు చెందిన సాంప్రదాయ మత్స్యకారులు నిప్పుపెట్టారు. ఇది గమనించిన  జాలారి ఎండాడ,వాసవానిపాలెం మత్స్యకారులు మంటలు ఆర్పారు. ఈ పని చేసింది పెద జాలారీపేట మత్స్యకారులేనని అనుమానిస్తూ వారి మూడు మర పడవలను వాసానిపాలెం తీసుకెళ్ళారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మత్స్యకార గ్రామాల వివాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇరు వర్గాల వెనక్కి తగ్గకపోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో మత్స్యకార గ్రామాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం