Hyderabad: తలైవా, సూపర్ స్టార్ రజినీకాంత్, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో కలిశారు. చంద్రబాబు ఇద్దరు కలుసుకున్న ఫోటోను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఇప్పుడు ఇది వైరల్ అవుతోంది.
Chandrababu Naidu-Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు. చంద్రబాబు నాయుడు వారు కలుసుకున్న ఫోటోను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఇప్పుడు ఇది వైరల్ అవుతోంది. అలాగే, వీరి భేటీపై మరోసరికొత్త చర్చ మొదలైంది. రాజకీయంగా పవన్ భేటీ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్.. చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
చంద్రబాబుతో సూపర్ స్టార్..
సూపర్ స్టార్ రజినీకాంత్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు. వారి సమావేశానికి సంబంధించిన ఫోటోను చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసంలో మర్యాదపూర్వకంగానే కలిసినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. చంద్రబాబు నాయుడు ఫోటోను షేర్ చేస్తూ.. "నా ప్రియ మిత్రుడు 'తలైవర్'ను కలుసుకోవడం, వారితో సంభాషించడం చాలా ఆనందంగా ఉంది"అని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు శాలువా కప్పి సూపర్ స్టార్ రజినీకాంత్ ను సత్కరించారు.
మార్యదపూర్వకంగానే..
చంద్రబాబు నాయుడును సూపర్ స్టార్ రజినీకాంత్ మర్యాదపూర్వకంగానే కలిసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. తనను కలవడానికి వచ్చిన సూపర్ స్టార్ కు చంద్రబాబు సాదర స్వాగతం పలికారనీ, ఈ సమావేశంలో ఇద్దరు వారివారి యోగక్షేమాలను గురించి ఆత్మీయంగా పలకరించుకున్నారని తెలిపారు. తలైవా తాను నటిస్తున్న ప్రస్తుత సినిమాల గురించి చంద్రబాబుకు చెప్పడంతో పాటు ఇతర విషయాలపై మాట్లాడుకున్నారని చెప్పారు. ఇద్దరి మధ్య చాలా కాలం నుంచి మంచి స్నేహం వుందనీ, అందుకే సూపర్ స్టార్ రజినీకాంత్ హైదరాబాద్ కు రావడంతో చంద్రబాబు నివాసానికి వెళ్లి కలిశారని పేర్కొన్నారు.
హైదరాబాద్ లో రజినీ కొత్త సినిమా షూటింగ్..
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమాలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శివ రాజ్ కుమార్, రమ్యకృష్ణ, వసంత్ రవి, వినాయకన్, యోగి బాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కూడా ఇందులో నటిస్తున్నారని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాతో శివ రాజ్ కుమార్ తమిళ తెరకు పరిచయమవుతున్నారు. ఇలా ముగ్గురు సూపర్ స్టార్ లు రజినీకాంత్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ లు ఈ చిత్రంలో నటిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఫిబ్రవరి 2022 లో తలైవర్ 169 వర్కింగ్ టైటిల్ కింద అధికారికంగా ప్రకటించబడింది. దీనికి జైలర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 14, 2023న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జైలర్ షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ మార్యదపూర్వకంగా చంద్రబాబును కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది.
మరో సరికొత్త చర్చ..
చంద్రబాబు నాయుడును సూపర్ స్టార్ రజినీకాంత్ మర్యాదపూర్వకంగానే కలిసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కానీ దీనిపై మరో సరికొత్త చర్చ మొదలైంది. రాజకీయంగానే ఈ సమావేశం జరిగివుంటుందనీ, అంతకు ముందు బాబుతో పవన్ భేటీని ఎత్తిచూపుతూ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఎందుకంటే గతంలో రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేసి.. మళ్లీ రాజకీయాలను నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ కాషాయ పార్టీకి ఆయన సానుకూలంగా ఉంటున్నారని రాజకీయ వర్గాల మాట. పవన్ భేటీ తర్వాత రజినీకాంత్, చంద్రబాబు కలవడం వెనుక కాషాయ పార్టీ నేతలు ఉన్నారా? అనే చర్చకూడా మొదలైంది.
It was a pleasure to meet and interact with my dear friend 'Thalaivar' today! pic.twitter.com/b8j1BxICEF
— N Chandrababu Naidu (@ncbn)