చిత్తూరులో వార్డు వాలంటీర్ ఆత్మహత్య.. వైసీపీ నేతల బెదిరింపులే కారణమని లేఖ..!

By Sumanth KanukulaFirst Published Jan 9, 2023, 2:56 PM IST
Highlights

చిత్తూరులో ఓ వార్డు వాలంటీర్‌ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. తాను ఆత్మహత్య చేసుకోవడానికి అధికార వైసీపీ నేతల బెదిరింపులే కారణమని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. 

చిత్తూరులో ఓ వార్డు వాలంటీర్‌ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. తాను ఆత్మహత్య చేసుకోవడానికి అధికార వైసీపీ నేతల బెదిరింపులే కారణమని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. వివరాలు.. చిత్తూరులోని 11వ వార్డు జోగులకాలనీకి చెందిన శరవణ వార్డు వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే శరవణ  . ఇంటికి సమీపంలోని వేపచెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అయితే చనిపోయేముందు రాసిన లేఖలో తన ఆత్మహత్యకు స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు, వైసీపీ నేత సయ్యద్ కారణమని ఆరోపించారు. 

రాష్ట్ర మహిళా ఫైనాన్స్‌ కమిషన్‌ డైరెక్టర్‌ అంజలి, వైసీపీ నేత సయ్యద్‌లతో పాటు మరికొందరు తన దగ్గర కొంత మొత్తంలో డబ్బు అప్పు తీసుకున్నారని చెప్పాci. ఆ డబ్బును అడిగినందుకు ఎమ్మెల్యే మనిషినని సయ్యద్ బెదిరింపులకు పాల్పడినట్టుగా సూసైడ్ నోట్‌లో ఆరోపించాడు. మరోసారి ఇలాగే డబ్బులు అడిగితే కుటుంబాన్ని చంపేస్తామంటూ బెదిరించారంటూ లేఖలో శరవణ పేర్కొన్నాడు. గత్యంతరం లేకనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టుగా చెప్పాడు. 

అయితే సయ్యద్ ఆత్మహత్యకు కారణమైన వారిని అరెస్ట్ చేయాలని అతడి కుటుంబ సభ్యులు, స్థానికులు చిత్తూరులోని గాంధీ విగ్రహం దగ్గర నిరసనకు దిగారు. అయితే పోలీసులు వారిని చెదరగొట్టరు. ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందని సయ్యద్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇక, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. 

ఇక, సయ్యద్ ఆత్మహత్య గురించి తెలుసుకున్న అంజలి.. తాను తీసుకున్న డబ్బులు ఇప్పుడే ఇచ్చేస్తానని తన పేరు మీడియాకు చెప్పొద్దని సయ్యద్ కుటుంబ సభ్యులను బతిమాలినట్టుగా కూడా కథనాలు వెలువడుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

click me!