ఛీ.. ఫస్ట్ నైట్ వీడియో తీసి.. సోషల్ మీడియాలో పెట్టిన భర్త.. అరెస్ట్...

Published : Mar 02, 2023, 09:31 AM IST
ఛీ.. ఫస్ట్ నైట్ వీడియో తీసి.. సోషల్ మీడియాలో పెట్టిన భర్త.. అరెస్ట్...

సారాంశం

తమ ఫస్ట్ నైట్ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడో భర్త. ఈ ఘటన వెలుగులోకి రావడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

కోనసీమ జిల్లా : ఇటీవల కాలంలో కొంతమంది ప్రవర్తిస్తున్న తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉంటోంది. నాలుగు గోడల మధ్య రహస్యంగా ఉండాల్సిన భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని సోషల్ మీడియాకు ఎక్కించి పైశాచిక ఆనందం పొందుతున్నారు కొంతమంది. ఇటీవల లైక్ ల కోసం సోషల్ మీడియాలో తమ ఫస్ట్ నైట్ వీడియోను పెట్టి  తీవ్ర విమర్శల పాలయ్యారు ఓ జంట.  అదే క్రమంలో.. అలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో చోటుచేసుకుంది. తొలిరాత్రి ఇద్దరు ఏకాంతంగా గడిపిన  క్షణాలను వీడియోలో బంధించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఓ భర్త. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే.. కాట్రేనికోన మండలంలోని ఓ తీర ప్రాంత గ్రామంలో ఈ ఘటన జరిగింది.  ఇది వెలుగులోకి రావడంతో ఆ భర్త కటకటాల పాలయ్యాడు. సదరు యువకుడి(20)కి ఫిబ్రవరి 8వ తేదీన అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికతో వివాహమైంది. ఆ తర్వాత వారికి పెద్దలు  శోభనం ఏర్పాటు చేశారు. ఆ యువకుడు తన భార్యతో కలిపిన మొదటి రాత్రి దృశ్యాలను వీడియోలో చిత్రీకరించాడు. ఆ తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఈ విషయం బాలిక తల్లికి తెలిసింది. 

బెంగుళూరులో ప్రేమోన్మాది ఘాతుకం: కాకినాడ యువతి దారుణ హత్య

దీంతో అల్లుడు మీద తీవ్ర అగ్రహానికి లోనైన ఆమె గత నెల 20వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి ఫిబ్రవరి 28వ తేదీన ఆ యువకుడిని అరెస్టు చేశారు. అతడిని కోర్టులో ప్రొడ్యూస్ చేయగా 14 రోజుల రిమాండ్ విధించారని బుధవారం కాట్రేనికోన ఎస్సై టి శ్రీనివాస్ తెలిపారు. అయితే ఘటన జరిగిన వెంటనే విషయం తెలిసి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడిందట. కాకపోతే అధికార పార్టీ ప్రాబల్యం ఉన్న గ్రామ పెద్దలు ఈ విషయాన్ని కప్పిపుంచేందుకు ప్రైవేటుగా పంచాయతీ చేశారని సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?
IMD Rain Alert : ఈ రెండ్రోజులు వర్ష బీభత్సమే... ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం