
రాష్ట్రంలో కొత్తగా ఆరు మండలాలు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. విజయనగరం, చిత్తూరు, నంద్యాల, అనంతపురం, ఒంగోలులను అర్బన్, రూరల్ మండలాలుగా విభజిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 30 రోజుల్లోగా అభ్యంతరాలు, సూచనలను కలెక్టర్లకు తెలపాలని ప్రభుత్వం సూచించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.