అన్నం పెట్టలేదని హత్య.. మద్యంమత్తులో భార్యను కొట్టి చంపిన భర్త..

By Bukka SumabalaFirst Published Aug 18, 2022, 2:03 PM IST
Highlights

అన్నం పెట్టలేదని కట్టుకున్న భార్యనే కడతేర్చాడో కసాయి భర్త. రాత్రి గొడవ పడి తనకు అన్నం పెట్టలేదని.. భార్యమీద కర్రతో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. 

ప్రకాశం : క్షణికావేశంతో చిన్న చిన్న కారణాలకే హత్యలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. చికెన్ వండలేదని, సెక్స్ కు ఒప్పుకోవడం లేదని, అన్నం పెట్టలేదని, మాట వినలేదని.. ఇలా చాలా చిన్న కారణాలకు భార్యలను మట్టుబెడుతున్నారు భర్తలు.. అలాంటి ఓ దారుణమే ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో దారుణం చోటు చేసుకుంది. మండల పరిధిలోని జమునపల్లె చెంచు కాలనీలో ఓ భర్త భార్యను దారుణంగా హతమార్చాడు. అన్నం పెట్టలేదన్న చిన్న కారణంతో ఇంత ఘాతుకానికి తెగించాడు. 

మార్కాపురం గ్రామీణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెంచు కాలనీకి చెందిన దాసరి చిన్న అంకాలు బుధవారం రాత్రి భార్య బసవమ్మ(35)తో గొడవపడ్డాడు. ఆమె భోజనం పెట్టలేదని అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. ఈ కారణంతోనే మద్యంమత్తులో తెల్లవారుజామున ఆమె మీద కర్రతో దాడి చేశాడు. ఆ సమయంలో కర్ర నేరుగా బసవమ్మ గుండెల్లో గుచ్చుకుంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించేలోపే ఆమె మృతి చెందింది. సమాచారం అందున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

దారుణం.. అప్పు అడిగితే.. వివాహితను భయపెట్టి నగ్న వీడియో కాల్, ఇద్దరి అరెస్ట్..

ఇదిలా ఉండగా, ఆగస్ట్ 1న తమిళనాడులో ఇలాంటి ఘటనే తమిళనాడులో వెలుగు చూసింది. తమిళనాడు నారాయణవనం మండలంలోని కైలాసకోన కొండపై గతనెల భర్త చేతిలో హత్యకు గురైన వివాహిత మృతదేహం ఆనవాళ్లను పోలీసులు జూలై 31న కనుగొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లా సింగూర్ ప్రాంతానికి చెందిన మదన్, తమిళ సెల్వి మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. మదన్ చెడు వ్యసనాలకు బానిస కావడంతో పాటు.. భార్యపై అనుమానం వ్యక్తం చేసేవాడు. 

దీంతో వరకట్నం పేరుతో తరచు వేధిస్తుండేవాడు.  జూన్ 25న తమిళ సెల్వితో కలిసి కైలాసకోనకు వచ్చాడు. ఆమెను కొండమీద ఉన్న బావుల సమీపంలోని అటవీ ప్రాంతం వద్దకు తీసుకువెళ్లి కత్తితో పొడిచాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. కూతురు కనిపించకపోవడం.. ఆమె తల్లిదండ్రులు మణ్ గండన్, పల్గీసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మదన్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. వారి విచారణలో షాకింగ్ విషయాలు మదన్ చెప్పుకొచ్చాడు. ఆమెను కైలాసకోన కొండపైకి తీసుకు వెళ్లానని, తమ మధ్య గొడవ జరిగిందని, కత్తితో పొడిచానని చెప్పాడు. 

ఆ తరువాత ఆమె తీవ్రంగా గాయపడటంతో.. అక్కడే వదిలేసి ఇంటికి వచ్చేసానని చెప్పాడు. గంజాయి మత్తులో ఉండడంతో ఆ ప్రాంతం సరిగా గుర్తు లేదు అని కూడా చెప్పాడు. నిందితుడు చెప్పిన సమాచారం ప్రకారం తమిళనాడు ఎస్సై రమేష్ కైలాసపురంలో ప్రత్యేక బృందంతో తమిళసెల్వి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. నెలరోజుల తర్వాత జూలై 31 ఉదయం కొండపై తమిళసెల్వి దుస్తులు, మెట్టెలు, పాదరక్షలు ఆధారంగా మృతదేహాన్ని గుర్తించి పంచనామా చేపట్టారు. 

click me!