అంగన్ వాడీ ఆయాను అనుమానంతో గొంతుకోసి.. దారుణంగా హత్య చేసిన భర్త..

By Bukka SumabalaFirst Published Dec 13, 2022, 9:21 AM IST
Highlights

అంగన్ వాడీ ఆయాను కట్టుకున్న భర్తే అత్యంత దారుణంగా హత్య చేశాడు. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ హత్య కలకలం రేపింది. 

పశ్చిమ గోదావరి జిల్లా : ఓ మహిళను ఆమె భర్తే అత్యంత దారుణంగా హతమార్చాడు. కట్టుకున్నోడే కాలయముడుగా మారాడు. పశ్చిమగోదావరి జిల్లాలో అంగన్వాడీ హెల్పర్ హత్య కేసు సంచలనం రేపింది. ఈ కేసులో కట్టుకున్న భర్త అత్యంత కర్కశంగా కత్తితో నరికి ఆమెను చంపాడు. దీంతో ఆమె ముగ్గురు పిల్లలు అనాధలయ్యారు. భార్యపై అనుమానంతో ఆమె మెడను కత్తితో కోసి చంపేశాడు నిందితుడు. పశ్చిమగోదావరి జిల్లాలోని కుక్కునూరు లో ఈ ఘటన చోటు చేసుకుంది. హత్య చేసిన తర్వాత అతను పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. 

తాళ్లపూడి ఎస్ ఐ కే వెంకట రమణ కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాళ్లపూడి పరిధిలోని కుక్కునూరు అంగన్వాడీ కేంద్రంలో ఆటపాకల ఆశాజ్యోతి(30) ఆయాగా పనిచేస్తుంది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త పాకల వీర వెంకట సత్యనారాయణ తో విభేదాలు రావడంతో కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు. అయితే, ఇటీవల మళ్లీ పిల్లల కోసం ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో భార్య మీద అతను అనుమానం పెంచుకున్నాడు.

సాఫ్ట్ వేర్ ఉద్యోగి హత్య కేసు : అక్కని ప్రేమించి మోసం చేశాడు.. కాదు ఆమె చెల్లివరుస అవుతుంది.. కొత్త ట్విస్టులు

దీంతో సోమవారం నాడు ఆశాజ్యోతి స్కూలుకు వెళ్లే సమయంలో ఆమెతో సత్యనారాయణ గొడవ పడ్డాడు. ఆ గొడవలో ఆమె మెడపై కత్తితో పొడిచి హత్య చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైంది. ఆ రక్తపు మడుగులో  ఆశాజ్యోతి పడి పోయింది. అక్కడే గిలగిలా కొట్టుకుని మృతి చెందింది. ఈ విషయం తెలిసిన అమ్మాయి తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. కూతురిపై అనుమానం తోనే అల్లడు ఇంత దారుణానికి ఒడిగట్టాడని మృతురాలి తండ్రి పెద్ద నారాయణ ఆరోపించాడు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కె వెంకటరమణ కేసు నమోదు చేసుకున్నాడు. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలిని కోవూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  ఘటనా స్థలం దొరికిన ఆధారాల మేరకు వివరాలను సేకరిస్తున్నారు.

వీరి పిల్లలు సురేంద్ర, తేజ, గోపి దుర్గలు తల్లి మరణించడం, తండ్రి జైలుకు వెళ్లడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వీరు వరుసగా ఎనిమిదో తరగతి, 5వ తరగతి, నాలుగో తరగతి చదువుతున్నారు. మండలంలోని అంగన్వాడీ వర్కర్లు ఆశాజ్యోతి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మృతదేహానికి నివాళులు అర్పించారు.
 

click me!