తండ్రికి తెలియకుండా రూ.80వేలు ఖర్చు.. వాటిని తిరిగి జమ చేయాలని కిడ్నీ అమ్మకానికి పెట్టిన ఇంటర్ విద్యార్థిని..

Published : Dec 13, 2022, 07:13 AM IST
తండ్రికి తెలియకుండా రూ.80వేలు ఖర్చు.. వాటిని తిరిగి జమ చేయాలని కిడ్నీ అమ్మకానికి పెట్టిన ఇంటర్ విద్యార్థిని..

సారాంశం

ఓ అమ్మాయి తండ్రికి తెలియకుండా ఖర్చుపెట్టిన డబ్బు తిరిగి జమచేయాలనుకుని.. పెద్ద సైబర్ వలలో చిక్కుకుంది. దీంతో రూ.16 లక్షలు పోగొట్టుకుంది.   

గుంటూరు : సైబర్ నేరగాళ్ల వలలో పడి ఓ విద్యార్థిని తన తండ్రి ఖాతాలోంచి 16 లక్షలు పోగొట్టింది. చిన్న తప్పు చేసి.. అది ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కప్పిపుచ్చుకునేందుకు ఆ విద్యార్థిని  చేసిన చేసిన పొరపాటు ఇంతటికి దారి తీసింది. ఫిరంగిపురానికి చెందిన ఓ అమ్మాయి గుంటూరులో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. తండ్రికి తెలియకుండా డబ్బులు ఖర్చు పెట్టింది. తెలిస్తే కొప్పడతాడు అని భయంతో కిడ్నీ అమ్మకానికి పెట్టింది. ఆ తర్వాతి క్రమంలో వారు చేసిన మోసంతో రూ.16 లక్షలు విడతలవారీగా పంపి మోసపోయింది. చివరికి ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో తండ్రి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.

అలా, ఆ విద్యార్థినికి జరిగిన మోసం బయట పడింది. ఈ కేసులో ఈ కేసులో విద్యార్థిని సురక్షితంగా బయటపడడంతో ఇంట్లో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సోమవారంనాడు బాధితురాలు, ఆమె తండ్రి ఏపీ ఆర్ ఎస్ ఆఫీస్ కు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. దీని మీద పోలీసులు, బాధితులు  మీడియాతో మాట్లాడారు. ఇంటర్ విద్యార్థిని  మాట్లాడుతూ ‘నాకు ఫోన్ లేదు. ఫోన్ కావాలని అడిగితే నాన్న తన సెల్ ఫోన్ ఇచ్చాడు. అందులో ఫోన్ పేకు నాన్న బ్యాంకు అకౌంట్ లింక్ చేసి ఉంది. అది చూసి నేను నాన్నకు తెలియకుండా రూ.80వేలు పెట్టి బట్టలు, వాచ్ కొన్నా. అంత పెద్ద మొత్తం ఖర్చు పెట్టడంతో భయం వేసింది.  నాన్నకు తెలిసే లోపే ఆ డబ్బు ఎలాగైనా అకౌంట్లో జమ చేయాలనుకున్నా.

Heavy rain: తిరుప‌తిలో భారీ వ‌ర్షం.. స్తంభించిన జనజీవనం

అంత డబ్బు ఎలా సంపాదించాలో అర్థం కాలేదు. ఫ్రెండ్స్ ని అని అడిగితే.. కిడ్నీ అమ్మితే డబ్బులు వస్తాయని చెప్పారు. దీనికోసం కిడ్నీ ఎవరైనా కొంటారేమోనని ఆన్లైన్ లో వెతికాను. ఒక ప్రకటన చూశాను. అర్జెంట్ గా కిడ్నీ కావాలని.. అమ్మితే ఏడు కోట్ల రూపాయలు ఇస్తామని ఒక సైట్ లో యాడ్ కనిపించింది. అందులో ప్రవీణ్ రాజ్ పేరుతో డాక్టర్ ఫోటో, ఫోన్ నెంబర్, మెయిల్ అడ్రస్ హాస్పిటల్ పేర్లు ఉన్నాయి. ఫోన్ చేస్తే  ప్రవీణ్ రాజ్ మాట్లాడాడు. మొదటి సగం డబ్బులు ఆ తర్వాత డబ్బులు ఇస్తానని చెప్పాడు.  దానికి అతను చెప్పిన టెస్టులు చేయించుకోమన్నాడు. అన్నీ చేపించి రిపోర్టులు అతనికి పంపాను. అది చూసిన అతను ఓకే కిడ్నీ ఇవ్వచ్చు అని చెప్పాడు. మొదటి విడతగా రూ.3.50 కోట్లు  వేస్తాను అని చెప్పాడు. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడిగితే, నాకు అకౌంట్ లేకపోవటంతో మా నాన్న డీటెయిల్స్ ఇచ్చాను. 

అకౌంట్ కి మూడున్నర కోట్లు జమ అయినట్లు స్క్రీన్ షాట్ తీసి వాట్స్అప్ చేశాడు. నేను బ్యాంక్ అకౌంట్ లో చెక్ చేస్తే బ్యాలెన్స్ కనిపించలేదు. ఇదేమిటని అడిగితే అవి డాలర్ల రూపంలో ఉన్నాయని.. ఇండియన్ కరెన్సీలో కి మారాలంటే టాక్స్  కట్టాలి అని చెప్పాడు. అలా మార్చినుంచి అక్టోబర్ వరకు రూ.16 లక్షలు విడతలవారీగా తీసుకున్నాడు. నాకు విసుగు వచ్చి అనుమానంతో అడిగితే ఒక పదివేలు నాన్న ఖాతాకు జమ చేశాడు. మిగిలిన మూడున్నర కోట్లు కూడా ఇలాగే జమవుతాయని నమ్మించాడు. నా డబ్బు తిరిగి ఇవ్వాలని గట్టిగా అడుగుతూ మెయిల్ చేశాను. దీంతో ఢిల్లీకి వస్తే ఇస్తానని చెప్పడంతో విమానంలో ఢిల్లీకి వెళ్లాను. కానీ అక్కడ ఎంతసేపటికి ఫోన్ చేసినా కూడా ఎవ్వరూ రాలేదు. 

చూసిచూసి విసుగు వచ్చి మళ్ళీ ట్రై చేశాను. మరో రూ.1.50లక్షలు జమ చేస్తే నగదు మొత్తం వస్తాయి అని చెప్పాడు. కానీ నాకు అతను మోసం చేశాడని అర్థం అయింది. వెంటనే  తిరిగి వచ్చేశాను’ అని ఆమె చెప్పింది. ఇక మరోవైపు కూతురు కనిపించడం లేదంటూ తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు వెతకగా.. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో స్నేహితురాలు వద్ద ఆమె దొరికింది. ఆమెను తండ్రికి అప్పగించారు. ఆ తర్వాత ఏం జరిగిందని కుటుంబ సభ్యులు ఆమెను.. ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో బాధితులు సోమవారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!