Heavy rain: తిరుప‌తిలో భారీ వ‌ర్షం.. స్తంభించిన జనజీవనం

Published : Dec 13, 2022, 05:58 AM IST
Heavy rain: తిరుప‌తిలో భారీ వ‌ర్షం.. స్తంభించిన జనజీవనం

సారాంశం

Tirupati: తిరుప‌తిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోజువారీ కూలీలు నాలుగు రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం పరిహారం చెల్లించడంలో మానవత్వంతో వ్యవహరించాలని కోరారు.  

Heavy rain in Tirupati: మాండౌస్ తుఫాను దాదాపు 48 గంటల క్రితం తీరం దాటిన తర్వాత కూడా తిరుపతి జిల్లా ప్రజలకు భారీ వర్షాల నుంచి ఉపశమనం లభించడం లేదు. ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వాన‌ల‌తో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. అయితే ఈసారి సూళ్లూరుపేట, గూడూరు డివిజన్లతో పోలిస్తే శ్రీకాళహస్తి, తిరుపతి డివిజన్లపై వర్షాల ప్రభావం ఎక్కువగా పడింది. జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.

పిచ్చాటూరు, నారాయణవనం, శ్రీకాళహస్తిలో సోమవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వరుసగా 45, 43.4, 33 మిల్లీ మీట‌ర్ల‌ వర్షపాతం నమోదు కాగా డివిజన్‌లో పగటిపూట సగటున 31.5 మిల్లీ మీట‌ర్ల వ‌ర్ష‌పాతం నమోదైంది. తిరుపతి డివిజన్‌లో చంద్రగిరిలో 44.2 మిల్లీ మీట‌ర్ల వర్షపాతం నమోదు కాగా, పుత్తూరు (39 మిల్లీ మీట‌ర్లు), తిరుపతి అర్బన్ (35.2 మిల్లీ మీట‌ర్లు), వడమాలపేట (33.8 మిల్లీ మీట‌ర్లు), రామచంద్ర పురం (31.2 మిల్లీ మీట‌ర్లు) ప్రాంతాల్లో సగటు వర్షపాతం 30.8 మిల్లీ మీట‌ర్లుగా న‌మోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలకు ముఖ్యంగా రోజు కూలీ దొరకక కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రిజర్వాయర్లు, ట్యాంకులు, ఇతర వాటర్‌బాడీలు ఇప్పటికీ ఇన్‌ఫ్లోలను పొందుతున్నాయి. దీంతో ఇరిగేషన్ అధికారులు ఆయా ప‌రిస్థితుల‌ను రోజులో 24 గంట‌ల పాటు పర్యవేక్షిస్తున్నారు. 

సోమ‌వారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో తిరుపతి నగరంలోని పలు రహదారులపై వర్షపు నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెట్రోల్ బంక్‌లు, ఇతర ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రధాన రహదారులు చాలా సేపు నిర్మానుష్యంగా మారాయి. వరుసగా నాలుగో రోజు కూడా జనజీవనం స్తంభించిపోవడంతో ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులు, వీధి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాగా, తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పంటలు, ఆస్తులు నష్టపోయిన వారికి పరిహారం మంజూరు చేయడంలో మానవత్వంతో వ్యవహరించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లోలు వస్తున్నాయనీ, వాటిని పర్యవేక్షిస్తున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి ముఖ్యమంత్రికి తెలిపారు. 

వ‌ర్షం కార‌ణంగా మాన‌వ‌ ప్రాణన‌ష్టం జరగలేదు కానీ 16 పశువులు, 13 గొర్రెలు మరణించాయి. 159 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అన్ని మండల స్థాయి అధికారులు, మున్సిపల్ అధికారులతో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాలతో వాగులు,వంకలు, నదులు, కాల్వల వద్ద నీరు ఉధృతంగా ప్రవహించే ప్రమాదం ఉందనీ, ఆయా పోలీస్ స్టేషన్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. పోలీసు సిబ్బంది అందరూ 24x7 అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం పొందాలనుకునే వారు 100, 8099999977కు డయల్ చేస్తే, సంబంధిత పోలీసు సిబ్బంది వెంటనే సహాయం అందించడానికి అందుబాటులో ఉంటారని తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!