విజయవాడకు పోటెత్తిన భక్తులు: అమ్మవారి దర్శనానికి మూడు గంటల సమయం

By narsimha lodeFirst Published Oct 2, 2022, 11:29 AM IST
Highlights

ఇంద్రకీలాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు.మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకొనేందుకు భారీ సంఖ్యలో భక్తులో వచ్చారు. దీంతో క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి.


అమరావతి:విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది.మూలా నక్షత్రం రోజు అమ్మవారి దర్శనానికి భారీ గా భక్తులు వచ్చారు.  సరస్వతీ దేవిగా  ఇవాళ అమ్మవారు దర్శనం ఇచ్చారు. అమ్మవారి దర్శనం కోసం ఆదివారం  తెల్లవారుజాము  1 గంట నుండి భక్తులు వేచి ఉన్నారు.  దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతుంది. భక్తుల రద్దీతో క్యూ లైన్లు నిండిపోయాయి. వీఎంసీ , కెనాల్ రోడ్లు భక్తులతో నిండాయి. వినాయక గుడి నుండి చిన్న రాజగోపురం వద్దకు  భక్తులతో క్యూ లైన్ నిండిపోయింది.

సుమారు  2 లక్షల మంది భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో వీఐపీ దర్శనాలకు అనుమతివ్వడం లేదని ఆలయ ఈఓ చెప్పారు. ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్ ఇంద్రీకీలాద్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ సమయంలో అరగంట పాటు ఆలయంలో సాధారణభక్తులకు  దర్శనం నిలిపివేస్తారు.విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయం వద్దఐదు వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవీ శరన్నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని  ఇంద్రకీలాద్రి ఆలయానికి భారీగా ఆదాయం వస్తుంది. నిన్న ఒక్క రోజే రూ. 60.59 లక్షల ఆదాయం వచ్చింది.  వారం రోజుల్లో విజయవాడఆలయానికి రూ. 3కోట్ల మేరకు ఆదాయం వచ్చింది.  రూ. 500 వీఐపీ టికెట్ తో ఆలయానికి ఆదాయం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. 

click me!