దీక్షకు స్పందన బాగానే ఉంది

Published : May 02, 2017, 07:21 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
దీక్షకు స్పందన బాగానే ఉంది

సారాంశం

ప్రతిపక్ష నేత ఇచ్చిన పిలుపు మేరకు రైతులు ఎందుకు స్పందించారు. రుణమాఫీ చేస్తున్నామని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చామని ఓ వైపు చంద్రబాబు చెప్పుకుంటుంటే ఇంకోవైపు ప్రతిపక్ష నేత చేపట్టిన దీక్షకు రైతులు ఎందుకు అంతలా స్పందించారు?

రైతు సమస్యలపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జరుపుతున్న రైతు దీక్షకు బాగానే స్పందన కనిపించింది. రాష్ట్రంలోని నలుమూలల నుండి రైతులు పెద్ద ఎత్తున దీక్షలో పాల్గొన్నారు. సరే, దీక్ష అన్నాక జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడటం మామూలే కదా? అయితే, ఇక్కడ చూడాల్సింది ఏమిటంటే, ప్రతిపక్ష నేత ఇచ్చిన పిలుపు మేరకు రైతులు ఎందుకు స్పందించారు.

రుణమాఫీ చేస్తున్నామని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చామని ఓ వైపు చంద్రబాబు చెప్పుకుంటుంటే ఇంకోవైపు ప్రతిపక్ష నేత చేపట్టిన దీక్షకు రైతులు ఎందుకు అంతలా స్పందించారు? అంటే, గడచిన మూడేళ్ళుగా రైతాంగం మొత్తం ప్రభుత్వంపై అసంతృప్తితో ఉందన్న విషయం బయటపడుతోంది.

పోయిన ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలంటూ ఆచరణ సాధ్యంకాని హమీలను చంద్రబాబు అనేకం ఇచ్చారు. అందులో రైతు రుణమాఫీ కూడా ఒకటి. ప్రతిపక్షంలో ఉన్నపుడు రైతు రుణాలు సుమారు రూ. 84 వేల కోట్లని టిడిపి నేతలే చెప్పారు. అటువంటిది అధికారంలోకి రాగానే రుణమాఫి మొత్తం రూ. 80 వేల కోట్ల నుండి 35 వేల కోట్లకు పడిపోయింది. ఇక్కడే చంద్రన్న మాయాజాలం ప్రయోగించారు.

అధికారంలోకి రాగానే రుణమాఫీ చేసేందుకు అనేక నిబంధనలను తెరపైకి తెచ్చారు. దాని ప్రకారం వేలాది మంది రైతులకు తీవ్ర నిరాస ఎదురైంది.  పోనీ మిగిలిన రైతులకన్నా మాఫీ సక్రమంగా జరిగిందా అంటే అదీ లేదు. సవాలక్ష నిబంధనలు, వాయిదాల పద్దతని,  బాండ్లని అనేక అంశాలను తెరపైకి తెచ్చి మొత్తం ప్రక్రియను ఎవరికీ అర్ధం కాకుండా చేసారు. దాంతో మెజారీటి రైతాంగం ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇక, బ్యాంకుల్లో ఉన్న బంగారాన్ని పలు బ్యాంకులు వేలం వేసేసాయి. దాంతో రైతుకుటుంబాలు ధ్వజమెత్తుతున్నాయి.

ఇక, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవటం, స్ధిరీకరణ నిధిని ఏర్పాటు చేయకపోవటం, రాజధాని ప్రాంతంలోని రైతులకు చెందిన వేలాది ఎకరాలను సమీకరణ, సేకరణ పేర్లతో లాగేసుకోవటం లాంటి కారణాల వల్ల కూడా రైంతాగం ప్రభుత్వంపై మండిపడుతోంది. ఇటువంటి నేపధ్యంలోనే జగన్ రైతు దీక్ష చేయటంతో రైతుల నుండి స్పందన బాగానే కనిపించింది.

PREV
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu