అమరావతి  నిర్మాణం సాధ్యమేనా?

Published : May 02, 2017, 02:38 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
అమరావతి  నిర్మాణం సాధ్యమేనా?

సారాంశం

ఒకవైపేమో ముందస్తు ఎన్నికల వాతావరణం నెలకొంది. ముందస్తు ఎన్నికలే నిజమైతే ఇక ఉండేది మహా అయితే ఏడాది కాలమే. మూడేళ్ళల్లో చేయలేనిది ఏడాదిలో ప్రభుత్వం ఏం చేయగలుగుతుందో ఎవరికీ అర్ధం కావటం లేదు.

అమరావతి నిర్మాణంపై అందరిలోనూ అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒక వైపు కోర్టులో వేలాది కేసులు విచారణ దశలో ఉన్నాయి. ఇంకోవైపు డిజైన్లే ఎంపికే కాలేదు. డిజైన్లను ప్రభుత్వం ఖరారు చేసిన తర్వాత వాటిని ప్రజాభిప్రాయానికి పెడతారట. అప్పుడు ప్రజల నుండి వచ్చిన అభిప్రాయాల మేరకు మళ్ళీ ఆ డిజైన్లలో మార్పులు చేర్పులు చేస్తారట. ఇవన్నీ అయ్యే పనేనా? ఒకవైపేమో ముందస్తు ఎన్నికల వాతావరణం నెలకొంది. ముందస్తు ఎన్నికలే నిజమైతే ఇక ఉండేది మహా అయితే ఏడాది కాలమే. మూడేళ్ళల్లో చేయలేనిది ఏడాదిలో ప్రభుత్వం ఏం చేయగలుగుతుందో ఎవరికీ అర్ధం కావటం లేదు.

రాజధాని నిర్మాణంపై వేల కేసులు నడుస్తున్నాయి. ప్రభుత్వం చేస్తున్న భూ సమీకరణ, సేకరణను వ్యతిరేకిస్తు రైతులు సుమారు 3 వేల కేసులు వేసారు.  వీటిల్లో ఓ వెయ్యి కేసులను కోర్టు కొట్టేసినా మిగిలిన 2 వేల కేసులను మాత్రం కోర్టులు విచారణకు స్వీకరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసులన్నీ వివిధ దశల్లో విచారణలో ఉన్నాయి. ఒకవైపు కేసులు విచారణలో ఉండగానే ప్రభుత్వం తాను  చేయదలుచుకున్నది చేసుకుపోతోంది. రాజధాని పేరుతో సేకరించిన, సమీకరించిన భూములతో రహదారులు వేయాలని, రింగ్ రోడ్లు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి నిర్మాణానికి రాజధాని గ్రామాల్లో ఇళ్ళను కూడా కూల్చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దాంతో ప్రభుత్వ చర్యపై రైతుల్లోను, గ్రామస్తుల్లోనూ ఉద్రిక్తత చోటు చేసుకుంటోంది.

ఈ కేసుల విచారణ ఎప్పటికి పూర్వవుతుందో ఎవరికీ తెలియటం లేదు. పైగా వివిధ దశల్లో ఉన్న కేసుల వల్ల ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఖర్చు నెత్తినపడుతోంది. అదే ఇప్పటికి నాలుగురు ఆర్కిటెక్ట్లు మారినా డిజైన్లు మాత్రం ఖరారు కాలేదు. పైగా గతంలో డిజైన్లు అందించిన మాకీ అసోసియేట్స్ ప్రతిపాదనలను ప్రభుత్వం తిరస్కరించింది. దాంతో అది చిలిచి చిలికి గాలివాన లాగ తయారైంది. చివరకు మాకీ అసోసియేట్స్-ప్రభుత్వం మధ్య న్యాయపరమైన వివాదాలు తలెత్తేలా ఉంది. దాంతో రాజధాని నిర్మాణంపైనే అందరిలోనూ అనుమానాలు తలెత్తుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu