దీనిలో కూడా ఆయన వద్ద రకాలు ఉండటం గమనార్హం. ఏ రకం ముందు.. ఎవరికి.. ఎలా ఇస్తారో ఇప్పుడు చూద్దాం..
కృష్ణపట్నం ఆనందయ్య మందుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అధికారుల అనుమతి తీసుకొని ఆనందయ్య.. ఆ మందును ప్రజలకు పంపిణీ చేయనున్నారు. ఈ మందు కోసం చాలా మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. కాగా.. అసలు ఆనందయ్య ఈ మందుని దేనితో తయారు చేస్తున్నారు అనే సందేహం చాలా మందిలో ఉంది. ఈ నేపథ్యంలో.. ఆనందయ్య మందు ఎలా తయారు చేస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.
దీనిలో కూడా ఆయన వద్ద రకాలు ఉండటం గమనార్హం. ఏ రకం ముందు.. ఎవరికి.. ఎలా ఇస్తారో ఇప్పుడు చూద్దాం..
undefined
పి రకం: ఈ మందుని.. తెల్లజిల్లేడు, మారేడు ఇగురు, నేరేడు ఇగురు, వేప ఇగురు, దేవర్ దంగిలే 5 బకెట్లు, నల్లజీలకర్ర, పట్టా, పసుపు, తోకమిరియాలు, పచ్చ కర్పూరం, ఫిరంగి చెక్క పొడి ఒక బకెట్ మిక్సీ వేసిన తర్వాత అవసరమైనంత తేనె కలిసి 4గంటల పాటు ఉడికించి.. ఈ మందును తయారు చేస్తారు.
ఈ మందుని కరోనా సోకిన వారు రోజుకి రెండు సార్లు చొప్పున మూడు రోజులు తీసుకోవాలి. కరోనా సోకనివారు.. రోగనిరోధక శక్తి కోసం కేవలం ఒక్క రోజులో రెండుసార్లు తీసుకుంటే సరిపోతుంది.
ఎఫ్ రకం: కరోనా సోకినవారికి ఈ మందు పంపిణీ చేస్తున్నారు. భోజననం తర్వాత రెండుసార్లు చొప్పున మూడు రోజులు తప్పకుండా తీసుకోవాలి. పుప్పిం టి ఆకు ఒక బకెట్, మిరియాలు, నల్లజీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్లు, జాజికాయ, తేనెలను రెండు నుంచి మూడు కిలోల వరకు సిద్ధం చేసి అన్నింటిని కలిపి మిక్సీవేసిన తరువాత చూర్ణంగా ఈ మందు తయారు చేస్తున్నారు.
ఎల్ రకం: ఇది కూడా పాజిటివ్ ఉన్న వారికే. పి, ఎఫ్ రకాల మందుతోపాటు రోజుకు ఒక్కసారి చొప్పున రెండు రోజులు తీసుకోవాలి. నేల ఉసిరి, గుంటగలగర ఆకులు ఒక బకెట్, మిరి యాలు, నల్లజీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్ల చెక్క, జాజికాయ, తేనె రెండు మూడు కిలోలు తీసుకుని దీన్ని తయారు చేస్తున్నారు.
కె రకం: ఇది కూడా పాజిటివ్ ఉన్న వారికే. రోజుకు ఒక్కసారి చొప్పున రెండు రోజులు తీసుకోవాలి. పెద్ద పల్లేరు కాయలు ఒక బకెట్, మిరియాలు, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్ల చెక్క, జాజికాయ, తేనెలను రెండు నుంచి మూడు కిలోలు తీసుకుని కలిపి తయారు చేస్తున్నారు.
ఐ రకం: ఇది ఆక్సిజన్ తగ్గిన వారికి కంటి డ్రాప్స్. పల్స్‌ను బట్టి ఒక్కో కంట్లో ఒక్క డ్రాప్ వేయాలి. దీన్లో తేనె, ముళ్లవంకాయ గుజ్జు, తోకమిరియాలు,కిలో తేనెతో ఈ డ్రాప్స్‌ను తయారు చేస్తున్నారు.