
ఆంధ్రప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. తన కూతురు ఓ వ్యక్తిని ప్రేమించిందని తెలుసుకున్న ఆ తండ్రి ఆగ్రహానికి లోనయ్యాడు. సొంత కూతురు అని కూడా చూడకుండా ఆమెను హతమార్చాడు. అనంతరం ఈ హత్య తానే చేసినట్టు అంగీకరిస్తూ ఓ సెల్పీ వీడియో రికార్డు చేశారు. దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
ఆ రాయి చంద్రబాబు వేయించుకున్నదే.. ఇదో కొత్త డ్రామా : నందిగామ ఘటనపై జోగి రమేశ్ వ్యాఖ్యలు
విశాఖపట్నంలో చోటు చేసుకున్న ఈ ఘనటకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. రెల్లి వీధిలో వడ్డాది వరప్రసాద్ రావు అనే వ్యక్తి నివసిస్తున్నాడు. డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కూతురర్లు ఉన్నారు. వరప్రసాద్ తన భార్య హేమలతతో చాలా కాలం కిందటే విడిపోయాడు. కాగా.. కొంత కాలం కిందట పెద్ద కుతురు లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్లిపోయింది.
దొంగల్లాగా రాళ్లు విసురుతారా... వైసీపీ రౌడీలకు భయపడేది లేదు : నందిగామ ఘటనపై చంద్రబాబు
తన ఇంట్లో 15 ఏళ్ల చిన్న కూతురుతో కలిసి ఉంటున్నాడు. ఆమె ప్రస్తుతం టెన్త్ క్లాస్ చదువుతోంది. ఈ క్రమంలో ఓ యువకుడిని ఆమె ప్రేమించింది. ఇటీవల అతడితో కలిసి వెళ్లిపోయింది. దీంతో తండ్రి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో పోలీసులు రెండు కుటుంబాల పెద్దలను స్టేషన్ కు పిలిపించారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. రాజీ కుదిర్చారు. అనంతరం చిన్న కూతురును వరప్రసాద్ రావు ఇంటికి తీసుకొని వెళ్లాడు. కాగా.. శుక్రవారం సాయంత్రం ఆమె చనిపోయి కనిపించిందని స్థానికులు గుర్తించారు.
వెంటనే వారు ఆ బాలికను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె మరణించిందని డాక్టర్లు తెలిపారు. అయితే ఈ హత్య తానే చేశానని తండ్రి వరప్రసాద్ అంగీకరించాడు. ‘‘ నా పెద్ద కుమార్తె అప్పటికే తన ప్రేమికుడితో పారిపోయింది. ఇప్పుడు పదో తరగతి చదువుతున్న నా చిన్న కుమార్తె కూడా వేరొకరిని ప్రేమించింది. ఆమె అడిగినవన్నీ నేను సమకూర్చారు. ఆమెను ముద్దుగా పెంచాను. ఆ వ్యక్తితో మాట్లాడవద్దని నేను ఆమెను హెచ్చరించాను. కానీ వినలేదు. అందుకే నేను ఆమెను చంపాను’’ అని ఆయన సెల్పీ వీడియోలో తెలిపారు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.