వైసీపీలోకి హితేష్, బీజేపీలోనే పురంధేశ్వరీ: దగ్గుబాటి వెంకటేశ్వరరావు

By narsimha lodeFirst Published Jan 27, 2019, 3:07 PM IST
Highlights

వైసీపీలోకి దగ్గుబాటి హితేష్ చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారు. ఈ విషయాన్ని దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రకటించారు. పార్టీలో ఎప్పుడూ చేరే విషయాన్ని త్వరలోనే ప్రకటించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
 

హైదరాబాద్: వైసీపీలోకి దగ్గుబాటి హితేష్ చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారు. ఈ విషయాన్ని దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రకటించారు. పార్టీలో ఎప్పుడూ చేరే విషయాన్ని త్వరలోనే ప్రకటించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

ఆదివారం నాడు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌తో భేటీ అయిన తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.వైసీపీతో కలిసి పనిచేసేందుకు హితేష్ సిద్దంగా ఉన్నాడని దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పారు.బీజేపీలో  తన భార్య పురంధేశ్వరీ కొనసాగుతున్నారు. ఆమె బీజేపీలోనే కొనసాగాలని  బీజేపీ నాయకత్వం ఆమెకు స్పష్టం చేసిందని  వెంకటేశ్వరరావు చెప్పారు. కుటుంబంలో ఉన్నవారంతా ఒకే పార్టీలో ఉండాల్సిన అవసరం లేదన్నారు. 

పురంధేశ్వరీ రాజకీయాల్లో ఉంటే బీజేపీలోనే కొనసాగుతారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పారు. పురంధేశ్వరీ పార్టీ మారరని ఆయన స్పష్టం చేశారు.పురంధేశ్వరీ రాజకీయం ఆమె వ్యక్తిగతమని ఆయన చెప్పారు.జగన్ ఇప్పటివరకు పడిన శ్రమకు గుర్తింపుగా ఫలితం కన్పిస్తే ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తాడని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు.

ఏపీలో పాలన గాడితప్పిందనేది నా భావన. ప్రభుత్వం వద్ద  డబ్బులు లేవని చెబుతూనే ప్రభుత్వ ఖర్చుతో దీక్షలు చేయడం సరైంది కాదన్నారు. క్షేత్రస్థాయిలో రైతుల రుణమాఫీ కోసం డబ్బులు ఇవ్వలేదన్నారు. కానీ, పోస్ట్ డేటేడ్ చెక్కులతో  మహిళలకు పసుపు కుంకుమ కింద డబ్బులు ఇవ్వడం సరైంది కాదన్నారు. 

పర్చూరు నియోజకవర్గంలో తన అనుచరులతో సమావేశాన్ని నిర్వహించి పార్టీలో ఎప్పుడు చేరే విషయమై ప్రకటన చేయనున్నట్టు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

జగన్‌తో భేటీ: వైసీపీలోకి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హితేష్

ఆ క్లియరెన్స్ వస్తే వైసీపీలోకి హితేష్: పురంధేశ్వరీ బీజేపీలోనే?

హరిబాబు దూరం: విశాఖ సీటు పురంధేశ్వరిదే

 

click me!