ఎంపీ గోరంట్ల మాధవ్ ఔదార్యం: క్షతగాత్రుడికి వైద్యం

By narsimha lodeFirst Published Dec 25, 2019, 2:50 PM IST
Highlights

అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ ఔదార్యం పట్ల నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన రైతును ఎంపీ మాధవ్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. 


హిందూపురం:  వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తన  ఔదార్యాన్ని చాటుకొన్నారు.  రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుడిని తన వాహనంలోనే ఆయన ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు.

Also read:మీసం తిప్పితే జేసీ బజారునపడ్డాడు: పోలీసు బూట్లను ముద్దాడిన గోరంట్ల

హిందూపురం మండలంలోని పొగరూరు కెనాల్ వద్ద ఎంపీ గోరంట్ల మాధవ్ వాహనాన్ని ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో గజరాంపల్లి గ్రామానికి చెందిన బుచ్చమ్మగారి వెంకటేశ్వర్ రెడ్డి గాయపడ్డాడు. వెంటనే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తన వాహనంలోనే వెంకటేశ్వర్ రెడ్డిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు.  క్షతగాత్రుడిని పామిడి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.

పొగరూరు గ్రామ కెనాల్ క్రాస్ వద్ద ఉన్నతన పొలానికి నీరు గట్టేందుకు రాంగ్ రూట్‌లో వెళ్తూ ఎంపీ వాహానాన్ని వెంకటేశ్వర్ రెడ్డి వాహనం ఢీకొన్నట్టుగా పోలీసులు తెలిపారు. పామిడి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం  మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 

వెంకటేశ్వర్ రెడ్డి వైద్యానికి అయ్యే ఖర్చును తాను భరిస్తానని ఎంపీ గోరంట్ల మాధవ్ తెలిపారు.ఈ మేరకు ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యానికి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తేల్చి చెప్పారు.

click me!