అమరాతి రైతులకు బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ బుధవారం నాడు మద్దతు పలికారు.
హైదరాబాద్: ఇది రైతుల సమస్య కాదు, రాజధాని సమస్య అని బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.రాజధాని రైతులకు బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ బుధవారం నాడు మద్దతు ప్రకటించారు.
Alos read:అమరావతి తరలింపును వ్యతిరేకిస్తాం: లెప్ట్
undefined
బుధవారం నాడు ఆయన అమరావతి రాజధాని రైతుల దీక్షలో పాల్గొని తన మద్దతు ప్రకటించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ ప్రాంతాన్ని రాజధానిగా గత ప్రభుత్వం ఎంపిక చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
వైసీపీ ప్రభుత్వం అమరావతి అభివృద్ధిని గాలికి వదిలేసిందన్నారు. జగన్ కు 151 ఎమ్మెల్యేలను ప్రజలు కట్టబెట్టినా కూడ ప్రజలను పట్టించుకొనే పరిస్థితి లేదన్నారు. ఒక రకమైన శాడిజం జగన్‌ది అని ఆయన అన్నారు.
అమరావతిని అభివృద్ధిని చేస్తామని గతంలో చెప్పిన జగన్ ఇవాళ రాజధానిని ఎందుకు మారుస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణ: కోసం కేంద్రం రూ. 2500 కోట్లు ఇచ్చిన విషయాన్ని కన్నా లక్ష్మీనారాయణ గుర్తు చేశారు.
ప్రజలు అభివృద్దిని కోరుకొంటారని ఆయన చెప్పారు. కానీ,దుర్వినియోగాన్ని కోరుకొరని చెప్పారు. ఎంతోమంది రైతుల త్యాగంతోనే అమరావతిలో రాజధాని ప్రారంభమైందన్నారు.
పరిపాలన వికేంద్రీకరణ అనేది ఓ పిచ్చి ఆలోచన అని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరిస్తే చాలని ఆయన జగన్ కు సూచించారు. రాజధాని రైతులకు బీజేపీ అండగా ఉంటుందని కన్నా లక్ష్మీనారాయణ తేల్చి చెప్పారు.